/rtv/media/media_files/2024/11/15/iv2yBSJq8fSS1zp3QR0r.jpg)
IPL 2025 Match Fixing Hyderabad businessman
IPL Match Fixing: ఐపీఎల్ సీజన్ 18లో మ్యాచ్ ఫిక్సింగ్ ఇష్యూ సంచలనం రేపుతోంది. ఆటగాళ్లను గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదిస్తున్నట్లు గుర్తించిన బీసీసీఐ భద్రతా విభాగం (ACSU) 10 జట్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా తమను సంప్రదిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించింది.
🚨 BCCI has warned all IPL players, staff & families about a Hyderabad-based businessman trying to trap them with gifts & parties.
— Apni Marziiiiii (@Neutral_25) April 16, 2025
He’s acting like a fan but has links to fixing.
Everyone is told to stay careful & report anything suspicious. [Cricbuzz]
కుటుంబాలకు ఖరీదైన బహుమతులు..
ఈ మేరకు ఆటగాళ్లతోపాటు, కోచ్, సహాయక సిబ్బంది, యజమానులు, వారి కుటుంబాలకు ఖరీదైన బహుమతులు ఇచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెలుగులోకి వచ్చింది. అయితే దీని వెనక హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతనికి బుకీలతో ప్రత్యక్ష సంబంధాలున్నాయని, అతను గతంలోనూ అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డట్లు తెలుస్తోంది. దీంతో ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికి ACSU వార్నింగ్ ఇచ్చింది. అతడితో ప్రస్తుతం ఏ విధమైన రిలేషన్ పెట్టుకోవద్దని, ముఖ్యంగా టోర్నీకి సంబంధించిన అంశాలను అతనితో ప్రస్తావించకూడదని స్పష్టం చేసింది. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని తెలిపింది.
ఇది కూడా చూడండి: Vizag Delivery Women : వైజాగ్ లో గర్భిణి దారుణ హత్య కేసులో బిగ్ ట్విస్ట్.. కడుపులో పండంటి ఆడబిడ్డ..!
ఎలా దగ్గరవుతాడంటే..
ఐపీఎల్ జట్లు బస చేస్తున్నహోటల్‌లో ఆటగాళ్లను కలుస్తాడు. వారిని ప్రైవేట్ పార్టీలకు ఆహ్వానిస్తాడు. జట్టు సభ్యులతోపాటు వారి కుటుంబాలకు బహుమతులు ఇస్తాడు. మొదట టీమ్ ఫేవరేట్ ఫ్యాన్స్ గా నటిస్తూ ఖరీదైన హోటళ్లు, ఆభరణాల దుకాణాలకు తీసుకెళ్తాడు. సోషల్ మీడియాలోనూ విదేశాల్లో ఉంటున్న ఆటగాళ్లు, యజమానుల బంధువులను సంప్రదించి మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: MS Dhoni రొమాంటిక్ అవతార్ లో సినిమాల్లోకి ధోని ఎంట్రీ? వీడియో షేర్ చేసిన కరణ్ జోహార్
IPL 2025 | match-fixing | today telugu news