CSK Vs KKR:  సొంతగడ్డపై చెన్నై చెత్త బ్యాటింగ్.. లో స్కోర్‌లో రికార్డ్!

కేకేఆర్‌తో చెపాక్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చెత్త బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణిత 20 ఓవర్లలో 103/9  పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే 4 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఓటమి తప్పేలా లేదు.

author-image
By srinivas
New Update
chennai

CSK Vs KKR

IPL 2025: కేకేఆర్‌తో చెపాక్‌ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌ చెత్త బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన సీఎస్‌కే నిర్ణిత 20 ఓవర్లలో 103/9  పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే 4 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఓటమి తప్పేలా లేదు. చెన్నై బ్యాటర్లలో శివమ్‌ దూబే (31 నాటౌట్) టాప్‌ స్కోరర్‌ గా నిలవగా విజయ్‌ శంకర్‌ (29) ఫర్వాలేదనిపించాడు. ఇక కోల్‌కతా బౌలర్లలో సునీల్‌ నరైన్‌ 3, వరుణ్‌ చక్రవర్తి 2, హర్షిత్‌ రాణా 2, మొయిన్‌ అలీ 1, వైభవ్‌ అరోరా 1 వికెట్‌ పడగొట్టారు. 

చెన్నై నమోదు చేసిన అతి తక్కువ స్కోర్:

70 - RCB vs CSK, 2019
95/9 - PBKS vs CSK, 2015
99 - DC vs CSK, 2019
101 - LSG vs MI, 2023
103/9 - CSK vs KKR, 2025

తుది జట్లు.. 

చెన్నై సూపర్‌ కింగ్స్‌: 
ఎంఎస్‌ ధోనీ (వికెట్‌ కీపర్‌, కెప్టెన్‌), రచిన్‌ రవీంద్ర, డేవాన్‌ కాన్వే, రాహుల్‌ త్రిపాఠి, విజయ్‌ శంకర్‌, శివమ్‌ దూబే, రవీంద్ర జడేజా, రవిచంద్రన్‌ అశ్విన్‌, నూర్‌ అహ్మద్‌, అన్షుల్‌ కాంబోజ్‌, ఖలీల్‌ అహ్మద్‌

కోల్‌కతా నైట్‌ రైడర్స్‌: 
అజింక్య రహానే (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌ కీపర్‌), సునీల్‌ నరైన్‌,  వెంకటేశ్‌ అయ్యర్‌, రింకు సింగ్‌, మొయిన్‌ అలీ, ఆండ్రీ రస్సెల్‌, రమణ్‌దీప్‌ సింగ్‌, హర్షిత్‌ రాణా, వైభవ్‌ అరోరా, వరుణ్‌ చక్రవర్తి.

telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు