ఆర్సీబీపై ఓటమి.. జీర్ణించుకోలేక టీవీ పగలగొట్టిన ధోనీ!

ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. చెన్నైప్లే ఆఫ్స్ నుంచి తప్పుకోవడంతో తట్టుకోలేక ఆర్సీబీ ఆటగాళ్లతో ధోనీ కరచాలనం చేయలేదని హర్భజన్ చెప్పినట్లు ఓ జర్నలిస్ట్ వీడియో పోస్ట్ చేశాడు.

New Update
drererer

MS Dhoni: 2024 ఐపీఎల్‌లో ఆర్సీబీపై చేతిలో ఓటమిని జీర్ణించుకోలేక ధోనీ కోపంతో టీవీ పగలగొట్టినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆ మ్యాచ్ లో ధోనీ ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదనే విషయం అందరికీ తెలిసిందే. కాగా గ్రౌండ్ నుంచి గదిలోకి వెళ్లిన ధోనీ ఆవేశంతో రగిలిపోయినట్లు పుకార్లు పుట్టుకు రాగా.. ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. 

ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత..

ఈ మేరకు మే 18న చిన్నస్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ చివరి లీగ్ మ్యాచ్‌ ఓడిపోయింది. ఆర్సీబీ 27 పరుగుల తేడాతో విజయం సాధించింది ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ నుంచి చెన్నై తప్పుకోగా ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. ధోనీ 13 బంతుల్లో 25 పరుగులు చేసినా విజయ తీరాలకు చేర్చలేకపోయాడు. 

ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు..

అయితే మ్యాచ్ తర్వాత హర్భజన్ సింగ్ తో మాట్లాడుతున్నప్పుడు తనకు ఈ విషయం తెలిసిందని ఓ జర్నలిస్టు సోషల్ మీడియాలో వెల్లడించారు. 'నేను ఒక ప్రత్యేకమైన స్కూప్ గురించి తెలుసుకున్నా. నేను భజ్జీ పాజీని ఎందుకు ధోని ఆర్సీబీ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదని అడిగాను. దీంతో ధోనీ కరచాలనం చేయడమే కాదు ఓ టీవీని కూడా పగలగొట్టాడు.  తిరుగు ప్రయాణంలో కూడా ప్రతిసారి వస్తువులను పిడిగుద్దులు గుద్దాడు. టోర్నీనుంచి నిష్రమించినందుకు ఆయన చాలా కోపంగా ఉన్నాడు' అని చెప్పినట్లు ఓ వీడియోలో వివరించాడు. 

Advertisment
తాజా కథనాలు