ఆసియాకప్ ఫీజు మొత్తం ఆర్మీకే.. కెప్టెన్ సంచలన నిర్ణయం!

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

New Update
surya aser

Asiacup 2025: ఆసియాకప్ విజయంతో భారత కెప్టెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ టోర్నీలో ఇప్పటికే పాక్‌పై విజయాన్ని పహల్గాం బాధితులకు అంకితం చేస్తున్నట్లు ప్రకటించి భారతీయుల మనసులు గెలుచుకున్న సూర్య.. తాజాగా ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్‌ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. 

టోర్నీ ఫీజు మొత్తం..

ఈ మేరకు మ్యాచ్ అనంతరం ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ గొప్ప విజయం సాధించినందుకు సంతోషంగా ఉందన్నాడు. ‘ఈ సందర్భంగా నేను ఓ ప్రకటన చేస్తున్నా. ఆసియా కప్‌లో నాకు వచ్చిన మ్యాచ్‌ ఫీజును భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. నేను క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టినప్పటినుంచి ఛాంపియన్‌గా నిలిచిన జట్టు ట్రోఫీని అందుకోకపోవడం చూడలేదు. బహుశా ఇదే తొలిసారి అనుకుంటున్నా. చాలా కష్టపడి ట్రోఫీని సాధించాం. అయితే అసలైన ట్రోఫీలు డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఉన్నాయి. మా 14 మంది టీమ్, సహాయక సిబ్బందే నా రియల్‌ ట్రోఫీలు. సంబరాలు చేసుకొనేందుకు గంటరన్నరపాటు వేయిచ్ చేశాం. ఛాంపియన్‌ ట్రోఫీ బ్యానర్‌ కొసం ఆలస్యమైంది. నఖ్వీ నుంచి ట్రోఫీ తీసుకోకూడదని ఎవరు చెప్పలేదు. గ్రౌండ్ లోనే అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం' అంటూ సూర్య వివరించాడు.

2025 ఆసియాకప్ చారిత్రాత్మక ఫైనల్లో భారత్ పాకిస్థాన్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో భారత జట్టు 9వ సారి ఆసియాకప్‌ను (ODI , T20 ఫార్మాట్‌లు రెండూ కలిపి) గెలుచుకుంది. ఇది T20 ఆసియా కప్ మూడవ ఎడిషన్. కాగా దీనిలో టీమ్ ఇండియా రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. గతంలో భారత్ 2016 T20 ఆసియాకప్‌ను గెలుచుకుంది. 

ఇక మ్యాచ్ చివరి ఓవర్లో తిలక్ వర్మ.. హారిస్ రవూఫ్ వేసిన రెండవ బంతిని మిడ్ వికెట్ మీదుగా సిక్స్ బాదినప్పుడు కోచ్ గౌతమ్ గంభీర్ ఎమెషనల్ అయ్యాడు. విజయం ఖాయమనే ధీమాతో ఉత్సాహంగా సంబరాలు చేసుకున్నాడు. ఆనందంతో డ్రెస్సింగ్ రూమ్ టేబుల్‌ను కొడుతూ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisment
తాజా కథనాలు