Surya Kumar Yadav: సూర్యకుమార్ మాస్ స్పీచ్.. ఈ విజయం పహల్గాం ఉగ్రవాద దాడి బాధితులకు అంకితం

పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు తమ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. పాకిస్థాన్‌పై గెలిచిన అనంతరం ఆయన మాట్లాడుతూ, భారత సాయుధ బలగాలకు సంఘీభావం తెలిపారు. వారి ధైర్యసాహసాలను ప్రశంసించారు.

New Update
india win over pakistan suryakumar yadav dedicated  to pahalgam victims

india win over pakistan suryakumar yadav dedicated to pahalgam victims

భారత్ vs పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ఈ రెండు జట్ల మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు, ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అలాంటి మ్యాచ్ నిన్న (సెప్టెంబర్ 14) జరిగింది. కానీ ఆ మ్యాచ్ చెప్పుకునేంత రసవత్తరంగా అయితే సాగలేదు. చాలా చాలా నీరసంగా జరిగిందనే చెప్పాలి. పాకిస్తాన్ బ్యాటర్లను కేవలం అతి తక్కువ పరుగులకే భారత్ బౌలర్లు కట్టడి చేశారు. అనంతరం చిరకాల ప్రత్యర్థిపై ఆధిపత్యం చెలాయించారు. పాక్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత్ అలవోకగా ఛేదించి ఓడించింది. ఇలా ఆసియా కప్ టోర్నీ 2025లో వరుసగా రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 

ind vs pak

ఈ మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ గెలుపు పహల్గాం ఉగ్రదాడి బాధితుల కుటుంబాలకు, అలాగే ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సాయుధ దళలన్నింటికీ అంకితం అని తెలిపారు. అతడి మాటలతో క్రికెట్ అభిమానులు, ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అయ్యారు. సూర్య కుమార్ మాట్లాడుతూ.. ‘‘పహల్గాం లో జరిగిన ఉగ్రవాద దాడి నన్ను ఎంతో బాధించింది. అందువల్ల బాధితుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు ఇదే సరైన సందర్భమని నేను ఎంతో భావిస్తున్నాను. 

ఈ గెలుపుతో బాధిత ఫ్యామిలీలకు మా సంఘీభావాన్ని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ విజయాన్ని ఎంతో ధైర్యసాహసాలు చేసిన మన సాయుధ దళాలన్నింటికీ అంకితం చేయాలనుకుంటున్నాము. మనందరికీ వారు స్ఫూర్తినిచ్చారు.. ఇస్తూనే ఉంటారు. అవకాశం వచ్చినప్పుడల్లా వారి ముఖాల్లో చిరునవ్వు నింపేందుకు మా వంతు ప్రయత్నం చేస్తుంటాం’’ అంటూ పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. 

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌కు ముందు పాకిస్తాన్‌తో మ్యాచ్‌ను బాయ్‌కట్ చేయాలనే నినాదాలు భారత్‌లో లేవనెత్తాయి. చాలా మంది పాక్‌తో మ్యాచ్ ఆడవద్దని నినాదాలు చేశారు. ఈ మ్యాచ్‌ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ ఎట్టకేలకు మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో మొదట టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్దేశించిన 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్‌ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ 44 బంతుల్లో 40 పరుగులు చేశాడు. టెయిలెండర్‌ షహీన్‌ షా అఫ్రిది 16 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. భారత బౌలర్లలో కుల్‌దీప్‌ యాదవ్‌ 3 వికెట్లు, అక్షర్‌ పటేల్‌ 2, బుమ్రా 2, వరుణ్‌ చక్రవర్తి 1ను పాక్‌ను దెబ్బ తీశారు.

అనంతరం 128 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన భారత్ అలవోకగా స్కోర్‌ను కొట్టేసింది. కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ 37 బంతుల్లో 47 పరుగులతో నాటౌట్‌‌గా నిలిచాడు. అభిషేక్‌ శర్మ 13 బంతుల్లో 31 పరుగులు, తిలక్‌ వర్మ 31 బంతుల్లో 31 పరుగులతో చెలరేగారు. మొత్తంగా దుబాయ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ మెరుపు షాట్లతో లక్ష్యాన్ని కేవలం 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. టీమిండియా తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌ను ఢీకొంటుంది.

Advertisment
తాజా కథనాలు