/rtv/media/media_files/2025/09/28/india-vs-pakistan-asia-cup-2025-final-toss-2025-09-28-19-29-44.jpg)
India Vs Pakistan Asia Cup 2025 Final toss
ఆసియా కప్ 2025 టోర్నీలో భాగంగా ఇవాళ భారత్ vs పాకిస్తాన్ జట్ల మధ్య రసవత్తరమైన ఫైనల్ మ్యాచ్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దీంతో పాకిస్తాన్ బ్యాటింగ్‌కు దిగింది.
భారత్ (ప్లేయింగ్ XI):
అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI):
సాహిబ్జాదా ఫర్హాన్, ఫఖర్ జమాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అఘా(సి), హుస్సేన్ తలత్, మహ్మద్ హారీస్(w), మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హారీస్ రవూఫ్, అబ్రార్ అహ్మద్.
ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా జట్టుకు దూరం అయ్యాడు. దీంతో క్రికెట్ అభిమానులు తీవ్ర నిరాశ చెందుతున్నారు. ప్రతి మ్యాచ్‌లో తనదైన శైలిలో ఒకవైపు బౌలింగ్, మరోవైపు బ్యాటింగ్‌తో అదరగొట్టిన హార్దిక్ ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌లో లేకపోవడం టీమిండియాకు పెద్ద షాకే అని చెప్పాలి. అలాగే ఈ మ్యాచ్‌కు హార్దిక్ దూరం కావడంతో అతడి ప్లేస్‌లో రింకూ సింగ్‌కు అవకాశం లభించింది.
కాగా మొదటి నుంచి హార్దిక్ గాయం కారణంగా దూరం అవుతాడని.. అతడి స్థానంలో అర్ష్‌దీప్ సింగ్‌కు అవకాశం వస్తుందని అంతా భావించారు. కానీ చివరి నిమిషంలో రింకూసింగ్ హార్దిక్ ప్లేస్‌ను భర్తీ చేశాడు.