Ind vs Eng: మళ్లీ టాస్ ఓడిన భారత్.. ఇంగ్లాండ్ 130/2 బ్యాటింగ్!

భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కటక్‌ బారాబతి స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌తో వరుణ్‌ చక్రవర్తి వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 

author-image
By srinivas
New Update
ind vs eng

India Vs England 2nd ODI

Ind vs Eng: భారత్ Vs ఇంగ్లాండ్ మధ్య రెండో వన్డే మొదలైంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. కటక్‌లోని బారాబతి స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌తో భారత స్పిన్నర్ వరుణ్‌ చక్రవర్తి వన్డేల్లోకి అరంగేట్రం చేశాడు. గాయంతో తొలి వన్డేకు దూరమైన విరాట్‌ కోహ్లి ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. 

వన్డేల్లోనూ అదే జోరు..

ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్ దక్కించుకోవాని భారత్ చూస్తుండగా ఎలాగైనా గెలిచి సిరీస్ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని ఇంగ్లాండ్ భావిస్తోంది. ఇటీవలే ఇంగ్లాండ్‌పై టీ20 సిరీస్‌ నెగ్గిన భారత్ వన్డేల్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. అందుకు తగ్గట్టుగానే తుది జట్టును ఎంపిక చేయగా.. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేస్తున్నారు. ప్రస్తుతం 21 ఓవర్లకు 125 పరుగులు చేసిన ఇంగ్లాండ్ 2 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు. 

ఇదిలా ఉంటే... ఈ మ్యాచ్ లో మరో 50 పరుగులు చేస్తే భారత కెప్టెన్ రోహిత్ ఖాతాలో అరుదైన రికార్డు చేరనుంది. సచిన్‌ ను అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక రన్స్ చేసిన 2వ భారత ఓపెనర్‌గా నిలుస్తాడు. ఈ జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ (16,119 పరుగులు, 332 మ్యాచ్‌లు) అగ్రస్థానంలో ఉండగా సచిన్‌ (15,335 రన్స్, 346 మ్యాచ్‌లు) రెండో స్థానంలో ఉన్నాడు. రోహిత్ 342 మ్యాచ్‌ల్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి 45.22 సగటుతో 15,285 రన్స్ చేశాడు.

#telugu-news-updates #telugu-news-today #telugu-news #IND VS ENG ODI #rtv telugu news
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు