ఇండియా - బంగ్లాదేశ్ మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మేరకు బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. 95 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన టీమిండియా.. కేవలం మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
దీంతో 7 వికెట్ల తేడాతో విజయం నమోదు చేసింది. ఓపెనర్ జైస్వాల్ తన పవర్ హిట్టింగ్తో ఆకట్టుకున్నాడు. అన్ని ఫార్మాట్లకు తగ్గ క్రికెట్ స్ట్రోక్స్‌తో చెలరేగిపోతున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. 51 రన్స్ చేసి ఔటయ్యాడు. కోహ్లీ 29 రన్స్ చేసి నాటౌట్‌గా నిలిచాడు.
Also Read : అద్భుతం.. మూలవిరాట్‌ను తాకిన సూర్య కిరణాలు