బాయ్ ఫ్రెండ్ తో బుల్లితెర నటి ఫోజులు.. ఫొటోలు వైరల్ బుల్లితెర బ్యూటీ సిరి హన్మంతు దీపావళి సందర్భంగా తన బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోల్లో సిరి, శ్రీహన్ పెయిర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫొటోలు మీరు కూడా చూసేయండి. By Archana 01 Nov 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు సీరియల్స్, యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్, టీవీ షోలతో బుల్లితెర పై మంచి గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగింది. సీజన్ 5 లో టాప్ 5 కంటెస్టెంట్ గా నిలిచింది. Image Credits: Siri Hanumanthu/Instagram 2/8 తాజాగా సిరి తన బాయ్ ఫ్రెండ్, కాబోయే భర్త శ్రీహన్ తో కలిసి దీపావళి పండగను గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. Image Credits: Siri Hanumanthu/Instagram 3/8 ట్రెడిషనల్ అవుట్ ఫిట్స్ లో సిరి, శ్రీహన్ జంట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. సిరి వైట్ నెట్టెడ్ శారీ, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అందంగా ముస్తాబైంది. Image Credits: Siri Hanumanthu/Instagram 4/8 శ్రీహన్ కూడా కుర్తా ధరించి అందరి ఆకట్టుకుంటున్నాడు. ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు బ్యూటిఫుల్ కపుల్ అంటూ నెట్టింట కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Siri Hanumanthu/Instagram 5/8 షార్ట్ ఫిల్మ్స్ ద్వారా పరిచయమైన సిరి, శ్రీహన్ ఒకరినొకరు ప్రేమించుకున్నారు. గత కొంత కాలంగా రిలేషన్ షిప్ లో ఉన్న వీరిద్దరూ త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. Image Credits: Siri Hanumanthu/Instagram 6/8 సిరి, శ్రీహన్ మేడమ్ సార్.. మేడమ్ అంతే, గందరగోళం, రామ్లీలా సీరిస్ వంటి యూట్యూబ్ సీరీస్ లలో కలిసి నటించారు. Image Credits: Siri Hanumanthu/Instagram 7/8 కెరీర్ ప్రారంభంలో సిరి ఎవరే నువ్వు మోహిని, అగ్ని సాక్షి, సావిత్రమ్మ గారి అబ్బాయి సీరియల్స్ తో ప్రేక్షకులను బాగా మెప్పించింది. Image Credits: Siri Hanumanthu/Instagram 8/8 సిరి ఓటీటీలో 'పులి మేక', BFF సీరీస్ లు చేసింది. సీరీస్ లు చేస్తున్న సమయంలోనే స్టార్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. బాలీవుడ్ స్టార్ షారుక్ ఖాన్ 'జవాన్' సినిమాలో మెరిసింది. Image Credits: Siri Hanumanthu/Instagram మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి