IND Vs SA: టీమిండియా కొత్త టీం.. కెప్టెన్‌గా రిషబ్ పంత్ - అఫీషియల్ అనౌన్స్ మెంట్

రిషబ్ పంత్‌ను దక్షిణాఫ్రికా 'ఎ'తో జరగనున్న రెండు అనధికారిక టెస్ట్ (నాలుగు రోజుల) మ్యాచ్‌లకు భారత 'ఎ' జట్టుకు కెప్టెన్‌గా బీసీసీఐ నియమించింది. సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అక్టోబర్ 30 నుంచి బెంగళూరులో మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి.

New Update
India A squad for four-day matches against South Africa A announced

India A squad for four-day matches against South Africa A announced

దక్షిణాఫ్రికా ఎ జట్టుతో జరగనున్న రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం టీం ఇండియా 'ఎ' జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రకటించింది. నాలుగు రోజుల సిరీస్ కోసం రిషబ్ పంత్ ఫిట్నెస్ నుండి కోలుకుని జట్టులోకి తిరిగి వచ్చాడు. ఈ మేరకు పంత్ కు ఇండియా ఎ జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇంగ్లాండ్‌ పర్యటనలో కాలికి గాయమై సుదీర్ఘ కాలం ఆటకు దూరమైన పంత్.. ఈ సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. పంత్ ఫిట్‌నెస్‌ను వెల్లడించిన బీసీసీఐ వైద్య బృందం.. అతడిని కెప్టెన్‌గా నియమించింది. 

ఈ సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లకు బీసీసీఐ రెండు వేర్వేరు జట్లను ప్రకటించింది. రెండింటికీ రిషభ్ పంత్ సారథ్యం వహించనుండగా, తమిళనాడు యువ బ్యాటర్ సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. 

మొదటి మ్యాచ్ జట్టు 

మొదటి మ్యాచ్ అక్టోబర్ 30 నుంచి నవంబర్ 2 వరకు కొనసాగనుంది. ఈ మ్యాచ్ జట్టులో యువ ప్రతిభకు పెద్దపీట వేశారు. ఇందులో ముఖ్యంగా రజత్ పాటిదార్, దేవదత్ పడిక్కల్, ఎన్ జగదీశన్, ఆయుష్ మ్మాత్రే వంటి స్టార్ ఆటగాళ్లకు చోటు దక్కింది. ఆల్‌రౌండర్లుగా హర్ష్ దూబే, తనుష్ కొటియాన్, మానవ్ సుతార్ ఉన్నారు. పేస్ విభాగంలో అన్షుల్ కంబోజ్, యష్ ఠాకూర్ ఎంపికయ్యారు. 

రెండో మ్యాచ్ జట్టు 

రెండో మ్యాచ్ నవంబర్ 6 నుంచి నవంబర్ 9 వరకు కొనసాగనుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా జట్టులోకి కొంతమంది సీనియర్ ఆటగాళ్లు చేరనున్నారు. ఈ జట్టుకు కూడా పంత్‌ నాయకత్వం వహించనున్నారు. ఇందులో కేఎల్ రాహుల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్, ధ్రువ్ జురెల్ జట్టులో ఉంటారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఫాస్ట్ బౌలర్లు మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాష్‌దీప్ వంటి ఆటగాళ్లు ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే సిరీస్ ముగిసిన తర్వాత జట్టుతో కలుస్తారు. వీరు భారత్‌-ఏకు మరింత అనుభవాన్ని అందించనున్నారు. అక్టోబర్ చివరి వారం నుంచి నవంబర్ రెండో వారం వరకు ఈ మ్యాచ్‌లు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ)లో జరగనున్నాయి.

ఈ సిరీస్‌లో బలమైన ప్రదర్శన ఇవ్వడం ద్వారా యువ ఆటగాళ్లకు జాతీయ జట్టులో స్థానం సంపాదించుకోవడానికి ఒక సువర్ణావకాశం లభిస్తుంది. దక్షిణాఫ్రికా A తో ఆడటం వలన రాహుల్, సిరాజ్, ఆకాష్‌దీప్, ప్రసిద్ధ్ కృష్ణలకు అద్భుతమైన మ్యాచ్ ప్రాక్టీస్ లభిస్తుంది. A జట్టు తర్వాత.. దక్షిణాఫ్రికా ప్రధాన జట్టు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు T20I లతో కూడిన సిరీస్‌లో భారతదేశాన్ని ఎదుర్కొంటుంది. ఈ సిరీస్ లు భారతదేశంలో జరుగుతాయి.

మొదటి మ్యాచ్ జట్టు:

కెప్టెన్: రిషభ్ పంత్ (వికెట్ కీపర్)

వైస్ కెప్టెన్: సాయి సుదర్శన్

బ్యాటర్లు: ఆయుష్ మ్మాత్రే, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్, ఆయుష్ బడోని

వికెట్ కీపర్లు: ఎన్. జగదీశన్

ఆల్‌రౌండర్లు/స్పిన్నర్లు: హర్ష్ దూబే, తనుష్ కొటియాన్, మానవ్ సుతార్, సారాంష్ జైన్

పేసర్లు: అన్షుల్ కంబోజ్, యష్ ఠాకూర్

రెండో మ్యాచ్ జట్టు:

కెప్టెన్: రిషభ్ పంత్ (వికెట్ కీపర్)

వైస్ కెప్టెన్: సాయి సుదర్శన్

బ్యాటర్లు: కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్, రుతురాజ్ గైక్వాడ్, అభిమన్యు ఈశ్వరన్

వికెట్ కీపర్లు: ధ్రువ్ జురెల్

ఆల్‌రౌండర్లు/స్పిన్నర్లు: హర్ష్ దూబే, తనుష్ కొటియాన్, మానవ్ సుతార్

పేసర్లు: ఖలీల్ అహ్మద్, గుర్నూర్ బ్రార్, ప్రసిధ్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్, ఆకాశ్ దీప్

Advertisment
తాజా కథనాలు