/rtv/media/media_files/2025/09/26/india-vs-sri-lanka-today-match-2025-09-26-17-52-03.jpg)
india vs sri lanka today match
ఆసియా కప్ 2025 జోరుగా సాగుతోంది. ఈ టోర్నమెంట్‌లో టీమ్ ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటికి భారత జట్టు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పటికే ఫైనల్‌కు అర్హత సాధించిన భారత జట్టు.. ఇవాళ ఆసియా కప్ సూపర్ -4లో శ్రీలంకతో చివరి మ్యాచ్ ఆడనుంది. ఇవాళ్టి మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ తన బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించుకోబోతున్నాడు.
india vs sri lanka today match
ఇందులో భాగంగానే శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా బ్యాటింగ్ అండ్ బౌలింగ్‌లో కాస్త మార్పులు చేర్పులు చేయబోతున్నట్లు తెలుస్తోంది. రింకు సింగ్, జితేష్ శర్మలకు ఈ మ్యాచ్‌లో అవకాశం కల్పించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం. అదే సమయంలో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే శివమ్ దూబేను కూడా ఈ మ్యాచ్‌లో బెంచ్‌కే పరిమితం చేయబోతున్నట్లు సమాచారం. ఇది టీమిండియా ఫ్యాన్స్‌కు కాస్త నిరాశే అయినా.. కొత్త యంగ్‌స్టర్స్‌కి అవకాశం ఇస్తే వారి ప్రతిభ తెలుస్తుందంటూ మరికొందరు ఫ్యాన్స్ అంటున్నారు.
మరోవైపు శ్రీలంక ఈ టోర్నమెంట్‌ను విజయంతో ముగించాలని భావిస్తోంది. సూపర్ 4 రౌండ్‌లో శ్రీలంక తన ప్రారంభ మ్యాచ్‌లలో రెండింటిలోనూ ఓడిపోయింది. మొదటి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ వారిని ఓడించగా.. రెండవ మ్యాచ్‌లో పాకిస్తాన్ పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ఈ సంవత్సరం శ్రీలంక జట్టు బౌలర్లు, బ్యాటర్లు ఆశించిన స్థాయిలో రాణించలేదు.
ఇదిలా ఉంటే టోర్నమెంట్‌లో ఇప్పటివరకు భారత జట్టు తరపున ఓపెనర్ అభిషేక్ శర్మ అత్యధిక పరుగులు చేశాడు. ప్రతి మ్యాచ్‌లోనూ తన పవర్ ఏంటో చూపించాడు. తనను అదుపులో ఉంచడం బౌలర్లకు కష్టమని అర్థమయ్యేలా చేశాడు. ఇక మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో పరుగులు రాబడుతున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్‌లలో టీమిండియా ఓపెనర్లు అద్భుతమైన ఫామ్ కనబరిచారు.
కానీ మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు మాత్రం తడబడ్డారు. అందులోనూ కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్క మ్యాచ్‌లో పరుగులు రాబట్టాడు. పాకిస్థాన్‌తో జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌లో అతడు 47 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతకుమించి ఇతర ఏ మ్యాచ్‌లోనూ తన పవర్ చూపించలేకపోయాడు. చూడాలి మరి ఇవాళ్టి మ్యాచ్‌లో తన ప్రదర్శన ఎలా ఉండబోతుందో.