/rtv/media/media_files/2025/10/18/ind-vs-aus-odi-series-2025-10-18-06-51-59.jpg)
ind vs aus odi series
భారత్, ఆస్ట్రేలియా మధ్య వన్డే సిరీస్ అక్టోబర్ 19న ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ పెర్త్‌లో జరుగుతుంది. టీమిండియాలోకి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి రావడంతో.. భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఆస్ట్రేలియా జట్టు ఒకదాని తర్వాత ఒకటి పెద్ద ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది. వన్డే సిరీస్‌కు ముందు ఆతిథ్య జట్టుకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. గాయాలు, ఇతర కారణాల వల్ల ఐదుగురు కీలక ఆటగాళ్లు ఈ వన్డే సిరీస్‌కు దూరం అయ్యారు. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ సహా స్టార్ ఆల్‌రౌండర్లు, వికెట్ కీపర్లు జట్టుకు దూరమవడంతో.. భారత్ ఈ సిరీస్‌ను గెలిచేందుకు బలమైన అవకాశాలు లభించాయి.
ఆస్ట్రేలియాకు దూరమైన స్టార్ ప్లేయర్లు
పాట్ కమ్మిన్స్: ఆస్ట్రేలియార్ టెస్టు, వన్డే రెగ్యుల కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వెన్ను కింది భాగం గాయంతో బాధపడుతున్నాడు. దీని కారణంగా అతను ఈ వన్డే సిరీస్‌కు పూర్తిగా దూరమయ్యాడు. టెస్టు సిరీస్‌పై దృష్టి పెట్టడానికి అతనికి పూర్తి విశ్రాంతి ఇవ్వాలని క్రికెట్ ఆస్ట్రేలియా నిర్ణయించింది.
గ్లెన్ మాక్స్‌వెల్: విధ్వంసక ఆల్‌రౌండర్ మాక్స్‌వెల్ కూడా రిస్ట్ ఫ్రాక్చర్ (మణికట్టు గాయం) నుంచి కోలుకోకపోవడంతో వన్డే, టీ20 సిరీస్‌ల నుండి తప్పుకున్నాడు. అతడు లేకపోవడం ఆసీస్ బ్యాటింగ్, స్పిన్ బౌలింగ్‌పై తీవ్ర ప్రభావం చూపనుంది.
కామెరూన్ గ్రీన్: యంగ్ స్టార్ ఆల్‌రౌండర్ కామెరూన్ గ్రీన్ కూడా సైడ్ సోర్‌నెస్ గాయం కారణంగా వన్డే సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. ఆషెస్ టెస్టు సిరీస్‌కు సన్నద్ధమయ్యేందుకు అతడు దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెడుతున్నాడు. అతని స్థానంలో ఫామ్‌లో ఉన్న మార్నస్ లబుషేన్‌ను జట్టులోకి తీసుకున్నారు.
తొలి వన్డేకు దూరమైన ఆటగాళ్లు:
జోష్ ఇంగ్లిస్: ఈ వికెట్ కీపర్-బ్యాటర్ కాలి పిక్క గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదు. దీంతో ఇంగ్లిస్ కనీసం మొదటి రెండు వన్డేలకు దూరంగా ఉండనున్నాడు. అతని స్థానంలో జోష్ ఫిలిప్‌ను జట్టులోకి తీసుకున్నారు.
ఆడమ్ జంపా: ఆస్ట్రేలియా జట్టులోని కీలక స్పిన్నర్లలో ఒకడైన ఆడమ్ జంపా వ్యక్తిగత కారణాల వల్ల మొదటి వన్డేకు అందుబాటులో ఉండడం లేదు. రెండో వన్డే నుంచి అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది.
వీరితో పాటు మరో వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ కూడా వ్యక్తిగత కారణాల వల్ల మొదటి వన్డే ఆడడం లేదు. ఈ ప్రధాన ఆటగాళ్లు దూరం కావడంతో మిచెల్ మార్ష్ సారథ్యంలోని యువ ఆస్ట్రేలియా జట్టు భారత్‌లో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని బలమైన టీమ్ ఇండియా సవాలును ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
Follow Us