/rtv/media/media_files/2025/10/23/rohit-sharma-breaks-sourav-gangulys-record-2025-10-23-11-36-28.jpg)
Rohit Sharma breaks Sourav Ganguly's record
అడిలైడ్ ఓవల్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే జరుగుతోంది. ఇందులో భాగంగా మొదట టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్ కు దిగింది. ఈ మ్యాచ్‌లో భారత టాప్ ఆర్డర్ పేలవంగా రాణించింది. ఓపెనర్ రోహిత్ శర్మ చాలా నెమ్మదిగా బ్యాటింగ్ చేశాడు. మెల్లి మెల్లిగా పరుగులు రాబడుతూ తన పేరిట మరో రికార్డును నమోదు చేసుకున్నాడు.
IND Vs AUS 2nd ODI
హిట్‌మ్యాన్ రోహిత్ ఇప్పుడు పరుగుల పరంగా భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని వెనక్కి నెట్టాడు. వరుసగా రెండు మ్యాచ్‌లలో రోహిత్ గణనీయమైన రికార్డును సృష్టించాడు. పెర్త్‌లో కేవలం 8 పరుగులు చేసి రోహిత్ శర్మ పెవిలియన్‌కు తిరిగి వచ్చాడు. ఇప్పుడు అడిలైడ్ ఓవల్‌లో హిట్‌మ్యాన్ అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. 73 పరుగులు చేసి అదిరే ఫామ్ కనబరిచాడు. దీంతో రోహిత్ భారీ రికార్డును సాధించాడు. వన్డే క్రికెట్‌లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ ఇప్పుడు ఐదవ స్థానంలో ఉన్నాడు.
రోహిత్ 9180+ పరుగులతో సౌరవ్ గంగూలీని అధిగమించాడు. వన్డేల్లో ఓపెనింగ్ బ్యాట్స్‌మన్‌గా గంగూలీ 9146 పరుగులు చేశాడు. ఆడమ్ గిల్‌క్రిస్ట్ 9200 పరుగులతో ఈ జాబితాలో నాల్గవ స్థానంలో ఉన్నాడు. క్రిస్ గేల్ 10179 పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు. సనత్ జయసూర్య 12740 పరుగులతో రెండవ స్థానంలో ఉండగా, సచిన్ టెండూల్కర్ 15310 పరుగులతో మొదటి స్థానంలో ఉన్నాడు.
15310 - Sachin Tendulkar (340)
12740 - Sanath Jayasuriya (383)
10179 - Chris Gayle (274)
9200 - Adam Gilchrist (259)
9180 - Rohit Sharma (186)*
9146 - Sourav Ganguly (236)
Most runs in ODI by an Opener (inngs)
— 𝑺𝒉𝒆𝒃𝒂𝒔 (@Shebas_10dulkar) October 23, 2025
15310 - Sachin Tendulkar (340)
12740 - Sanath Jayasuriya (383)
10179 - Chris Gayle (274)
9200 - Adam Gilchrist (259)
9147 - Rohit Sharma (186)*
9146 - Sourav Ganguly (236)#AUSvIND
ఇదిలా ఉంటే అడిలైడ్ ఓవల్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో రోహిత్ శర్మ చాలా నెమ్మదిగా ఆరంభించాడు. వరుసగా రెండు వికెట్లు కోల్పోయినా.. రోహిత్ నిలకడగా పరుగులు రాబట్టాడు. భారత కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఈ మ్యాచ్‌లో 9 పరుగులు చేసి ఔటయ్యాడు. అలాగే విరాట్ కోహ్లీ మరోసారి డకౌట్ అయ్యాడు. ఒక్క పరుగు కూడా కొట్టకుండా పెవిలియన్ కు చేరాడు.
Follow Us