WTC : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ పాయింట్లలో భారత్ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రస్తుతం 61.11 శాతం పాయింట్లతో టాప్ వన్ లో నిలిచింది. 57.69 శాతంతో ఆసీస్ రెండో స్థానంలో కొనసాగుతోంది.
భారత్ ఖాతాలో 98 పాయింట్లు..
బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ లో జరిగిన మొదటి టెస్టులో ఆస్ట్రేలియాను 295 పరుగుల తేడాతో ఓడించింది భారత్. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతోపాటు WTC టేబుల్లో మొదటి స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం మొత్తం 98 పాయింట్లు భారత్ ఖాతాలో ఉండగా ఫైనల్ చేరాలంటే ఈ సిరీస్‌ను కనీసం 4-0 తేడాతో దక్కించుకోవాలి. ఈ మ్యాచ్ కు ముందు ఆస్ట్రేలియా 62.50 శాతం, భారత్ 58.33 శాతంతో తొలి రెండు స్థానాల్లో ఉండేవి. ఒక్క టెస్టుతో లెక్కలు తలకిందులయ్యాయి. ఇక డబ్ల్యూటీసీ టేబుల్లో లో శ్రీలంక (55.56), న్యూజిలాండ్ (54.55) దక్షిణాఫ్రికా (54.17) టాప్-5లో కొనసాగుతున్నాయి.