పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ICC స్ట్రాంగ్ కౌంటర్: వరల్డ్ కప్ ఆడకపోతే భారీ పెనాల్టీలు తప్పవు!

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్‌లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది.

New Update
pak

బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు భద్రతా కారణాల నెపంతో టీ20 వరల్డ్ కప్ నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో పయనిస్తూ భారత్‌లో ఆడేందుకు సతాయిస్తున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB)కు ఐసీసీ గట్టి వార్నింగ్ ఇచ్చింది. షెడ్యూల్ ప్రకారం టోర్నమెంట్‌లో పాల్గొనకపోతే పాకిస్థాన్‌పై కఠినమైన ఆంక్షలు  విధించడమే కాకుండా, భారీ స్థాయిలో జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

భారత్‌లో తమ జట్టుకు భద్రత ఉండదని, అందుకే తమ మ్యాచులను తటస్థ వేదికలకు మార్చాలని పాకిస్థాన్ పట్టుబడుతోంది. అయితే, ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో స్పష్టత ఇచ్చిన ఐసీసీ.. భారత్‌లో ఎటువంటి భద్రతా ముప్పు లేదని తేల్చి చెప్పింది. పాకిస్థాన్ గనుక మొండిగా వ్యవహరించి టోర్నీని బహిష్కరిస్తే, భవిష్యత్తులో ఐసీసీ నుండి వచ్చే నిధులు నిలిపివేయడంతో పాటు, ఆ దేశ క్రికెట్ సభ్యత్వంపై కూడా వేటు పడే అవకాశం ఉందని ఐసీసీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.

సహించేది లేదు

బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చినట్లుగానే, పాక్ గనుక తప్పుకుంటే మరో దేశానికి అవకాశం ఇస్తామని ఐసీసీ సంకేతాలు ఇచ్చింది. రాజకీయ కారణాలను క్రికెట్లోకి తీసుకువచ్చి టోర్నీని అస్థిరపరచాలని చూస్తే సహించేది లేదని ఐసీసీ కఠినంగా వ్యవహరిస్తోంది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి సంబంధించి పాకిస్థాన్ తీసుకునే నిర్ణయం ఇప్పుడు ఆ దేశ క్రికెట్ భవిష్యత్తును నిర్ణయించనుంది.

పాకిస్తాన్ పై ఐసిసి ఎలాంటి ఆంక్షలు విధించగలదు?

పాకిస్తాన్ T20 ప్రపంచ కప్ నుండి వైదొలగితే "మునుపెన్నడూ లేని విధంగా" ఆంక్షలు విధించడానికి ICC సిద్ధంగా ఉందని వర్గాలు హెచ్చరించాయి. 

పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో విదేశీ ఆటగాళ్లకు అనుమతి లేదు.
ఐసిసి నిధులు తగ్గడం వల్ల పిసిబికి భారీ ఆదాయ నష్టం
PSL కు అంతర్జాతీయ గుర్తింపు, వాణిజ్య మద్దతు ఉపసంహరణ
ఆసియా కప్ నుండి మినహాయింపు
పాకిస్తాన్ తో జరిగే అన్ని ద్వైపాక్షిక సిరీస్‌ల రద్దు.

Advertisment
తాజా కథనాలు