ICC : ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌.. టాప్‌-10లో ముగ్గురు భారతీయులు!

ఈ వారం ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ముగ్గురు భారత క్రికెటర్లు టాప్ 10లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ 5, యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

author-image
By srinivas
rohit sharma
New Update

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌ వివరాలను విడుదల చేసింది. ఈ వారం ర్యాకింగ్స్‌ టాప్ 10లో భారత్ నుంచి ముగ్గురు ఉండగా భారత సారథి రోహిత్‌ శర్మ 751 రేటింగ్‌ పాయింట్లతో 5వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి వన్డే, టెస్టు టాప్‌-5లో ఉన్న బ్యాటర్‌ రోహిత్‌ శర్మ ఒక్కడే. ఆ తర్వాత యశస్వి జైస్వాల్ 6, విరాట్ కోహ్లీ7 స్థానాల్లో నిలిచారు. ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, డారిల్ మిచెల్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో.. ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ నాలుగో స్థానంలో ఉన్నారు.

బౌలింగ్‌ విభాగంలో టీమ్‌ఇండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా పేసర్ జోష్ హేజిల్‌వుడ్‌, భారత్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా రెండో స్థానంలో ఉన్నారు. రవీంద్ర జడేజా 7, కుల్‌దీప్‌ యాదవ్‌ 15 కొనసాగుతున్నాడు. టాప్ 5 జట్లలో ఆస్ట్రేలియా 124 పాయింట్లతో ముందంజలో ఉండగా.. భారత్ 120 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇంగ్లాండ్ 3, సౌతాఫ్రికా 4, న్యూజీలాండ్ 5 స్థానంలో ఉన్నాయి.ఇక భారత్.. బంగ్లాదేశ్‌తో సెప్టెంబరు 19 నుంచి రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుండగా.. తొలి టెస్టు సెప్టెంబరు 19-23 చెన్నై వేదికగా, రెండో టెస్టు సెప్టెంబరు 27- అక్టోబర్ 1 కాన్పూర్‌ వేదికగా జరగనుంది. మొదటి టెస్టు జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.

#rohit-sharma #ravichandran-ashwin #icc-mens-cricket-rankings
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe