IND vs PAK : పాకిస్థాన్‌కు బిగ్ షాక్‌.. రెండు వికెట్లు డౌన్‌

ఆసియా కప్‌ 2025లో భాగంగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది.

New Update
india

ఆసియా కప్‌ 2025లో భాగంగా టీమ్‌ఇండియా, పాకిస్థాన్‌ జట్ల మధ్య దుబాయ్‌ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో టీ 20 మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ బ్యాటింగ్‌ ఎంచుకుంది. ప్రారంభంలోనే పాకిస్థాన్‌కు రెండు  బిగ్ షాకులు తగిలాయి. హార్దిక్‌ పాండ్య పాకిస్థాన్‌కు ముందుగా బిగ్ షాకిచ్చాడు.  తొలి బంతికే ఓపెనర్‌ సయిమ్‌ అయూబ్‌ను (0) పెవిలియన్‌కు పంపాడు . హార్దిక్‌ బౌలింగ్‌లో బుమ్రాకు క్యాచ్‌ ఇచ్చి అయూబ్‌ వెనుదిరిగాడు. అనంతరం జస్‌ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో  హార్దిక్‌ పాండ్యకు క్యాచ్‌ ఇచ్చి మహ్మద్‌ హారిస్‌ (3)  వెనుదిరిగాడు. 6 పరుగుల వద్ద రెండో వికెట్‌ను పాకిస్థాన్‌ కోల్పోయింది.  ప్రస్తుతం పాక్  రెండో ఓవర్ పూర్తయ్యే సమయానికి 7 పరుగులు చేసింది. ఫఖర్ జమాన్ (1),  సాహిబ్జాదా ఫర్హాన్ (2) పరుగులతో క్రీజులో ఉన్నారు. 


జట్లు:

భారత్ (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(సి), తిలక్ వర్మ, సంజు శాంసన్(w), శివమ్ దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి

పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, మహ్మద్ హారీస్(w), ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(సి), హసన్ నవాజ్, మహ్మద్ నవాజ్, ఫహీమ్ అష్రఫ్, షాహీన్ అఫ్రిది, సుఫియాన్ ముఖీమ్, అబ్రార్ అహ్మద్

Advertisment
తాజా కథనాలు