టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్. ఇతని ఆట గురించి అందరికీ తెలిసిందే. ఇప్పటికే చాలా టోర్నీల్లో హార్దిక్ తానేంటో...తన మ్యాజిక్ ఏంటో నిరూపించేసుకున్నాడు. ఇప్పుడు తాజాగా మరో అరుదైన రికార్డ్ సాధించాడు. టీ20 క్రికెట్‌లో 5 వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా తరఫున ఆడుతున్నాడు హార్దిక్ పాండ్యా. దీనిలో ఈ రికార్డ్ ను అధిమించాడు. ఈమ్యాచ్ గుజరాత్‌లో జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని బరోడా ఐదు వికెట్లు కోల్పోయి మూడు బంతులు మిగిలుండగానే ఛేదించింది. ఐదో స్థానంలో వచ్చిన హార్దిక్ పాండ్య 35 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74 పరుగులు చేశాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసిన హార్దిక్ ఒక వికెట్ కూడా పడగొట్టాడు. దీంతో టీ20ల్లో 5వేల పరుగులు, 100 వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. అంతేకాఉ ఆ లిస్ట్‌లో ఉన్న అందరినీ దాటేసి మొదటి స్థానంలో నిలిచాడు కూడా.
Also Read: Delhi: 50 ఏళ్ళల్లో ఈ కూటమీ ఇంతటి విజయాన్ని సాధించలేదు– మోదీ
రికార్డ్ సాధించిన భారత ఆటగాళ్ళు
హార్దిక్ పాండ్య- (5,067 పరుగులు, 180 వికెట్లు)
రవీంద్ర జడేజా - (3,684 పరుగులు, 225 వికెట్లు)
అక్షర్ పటేల్ -(2,960 పరుగులు, 227 వికెట్లు)
కృనాల్ పాండ్య- (2,712 పరుగులు, 138 వికెట్లు)
ఇర్ఫాన్ పఠాన్ - (2,020 పరుగులు, 173 వికెట్లు)
Also Read: జార్ఖండ్ కౌంటింగ్ పూర్తి..ఇండియా కూటమికి వచ్చిన సీట్లు ఎన్నో తెలుసా?