Glenn Maxwell చెత్త రికార్డు...ప్రాంచేజీ మారిన ఆట మారలే!

గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.  ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు.

New Update
maxwell duck

maxwell duck

అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆటగాడు మ్యాక్స్‌వెల్ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు.  ఈ మ్యాచ్‌లో డకౌట్ కావడంతో మ్యాక్స్‌వెల్ చెత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్‌లో అత్యధిక (19) సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్  తరువాత రోహిత్ శర్మ (18) తర్వాతి స్థానంలో ఉన్నాడు. గతేడాది సీజన్ లో మ్యాక్స్‌వెల్ ఆర్సీబీ తరుపున కూడా ఇదే తరహా ఆటతీరు ఉండటంతో అతన్ని వదులుకుంది. పంజాబ్ అతన్ని రూ. 4.2 కోట్లకు కొనుగోలు చేసింది. ప్రాంచేజీ మారిన మ్యాక్స్‌వెల్ ఆటలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు.

మరోవైపు పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 27 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం 64 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ఇందులో మూడు ఫోర్లు, ఆరు సిక్సులున్నాయి.  ప్రస్తుతం పంజాబ్ 15 ఓవర్లకు ఐదు వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.  

Also read :  ఇంతకీ ధోనీ.. విఘ్నేశ్‌తో ఏం మాట్లాడాడు?.. అసలు సంగతి ఇది!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు