/rtv/media/media_files/2025/04/01/GjiKcUFzPALnIg9HezU5.jpg)
HCA vs SRH
సన్‌రైజర్స్ హైదరాబాద్ హెచ్‌సీఏకు ఇస్తున్న ఐపీఎల్ కాంప్లిమెంటరీ పాస్‌లను ఇస్తోంది. అయితే అందులో కొన్ని పాస్‌లను ప్రైవేటు, ఇన్‌స్టిట్యూషన్ క్లబ్‌లు బ్లాక్‌లో అమ్ముకుంటున్నాయని హెచ్‌సీఏ మాజీ కార్యదర్శి శేష్‌నారాయణ ఆరోపించారు. ఎఫ్7 నుంచి ఎఫ్16 వరకు ఉన్న కార్పొరేట్ బాక్స్‌లను హెచ్‌సీఏలో ఉన్న కొందరు వ్యక్తులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. ఈ క్రమంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ జనరల్ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డికి శేష్‌నారాయణ బహిరంగ లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. కాంప్లిమెంటరీ పాస్‌లు, సన్‌రైజర్స్‌తో సంబంధాలు, హెచ్‌సీఏ పరిపాలన వ్యవహరాలపై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది.
ఇది కూడా చూడండి:Ind-Pak: భారత్-పాక్ యుద్ధమే జరిగితే గెలుపెవరిది? ఎవరి బలం ఎంతుంది?
అసలు వివాదం ఏంటంటే?
తమిళనాడుకు చెందిన సన్‌నెట్‌వర్క్ యాజమాన్యంలోని సన్‌రైజర్స్ ఫ్రాంచైజీ ఉన్న సంగతి తెలిసిందే. ఇది ఐపీఎల్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి హైదరాబాద్‌ను తమ హోమ్ గ్రౌండ్‌గా ఎంచుకొని ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్‌లో ఆడుతోంది. ఐపీఎల్ ఆడే సమయంలో ఉప్పల్ స్టేడియాన్ని రెంట్‌కు తీసుకుంటోంది. ఇందుకోసం ప్రతీ మ్యాచ్‌కు హెచ్‌సీఏకు రూ.కోటి చెల్లిస్తోంది.
ఇది కూడా చూడండి:PM Modi: వారిని మట్టిలో కలిపేస్తాం.. ఇక యుద్ధమే: మోదీ సంచలన ప్రకటన
మ్యాచ్ టికెట్ల విక్రయాలను కూడా సన్‌రైజర్స్ ఫ్రాంచైజీనే చూసుకుంటోంది. స్టేడియ కేపాసిటీ మొత్తం 39 వేలు. ఇందులో 10 శాతం అంటే 3900 టికెట్లను కాంప్లిమెంటరీ పాసుల రూపంలో SRH.. హెచ్‌సీఏకు ఫ్రీగా అందిస్తోంది. వీటిలో రూ.750 ధర టికెట్ల నుంచి రూ.20 వేలు విలువ చేసే కార్పొరేట్ బాక్స్ పాసులు కూడా ఉన్నాయి. ఈ కార్పొరేట్ బాక్స్ పాసుల విషయంలోనే సన్‌రైజర్స్‌కు, హెచ్‌సీఏకు మధ్య విభేదాలు వచ్చాయి.
ఇది కూడా చూడండి:Ind-Pak: సిమ్లా ఒప్పందాన్ని రద్దు చేసిన పాక్..అసలేంటీ ఒప్పందం..భారత్ మీద ఇంపాక్ట్ ఎలా?
ఉప్పల్ స్టేడియంలోని సౌత్ స్టాండ్ ఫస్ట్‌ఫ్లోర్‌లోని ఎఫ్-12ఏ బాక్స్‌లో గత పదేళ్ల నుంచి హెచ్‌సీఏకు 50 టికెట్లు కేటాయిస్తోంది. అయితే ఈ సీజన్‌లో మాత్రం ఆ బాక్స్ కెపాసిటీ 30 టికెట్లు మాత్రమే. దీంతో అదనంగా మరో 20 టికెట్లు ఇవ్వాలని SRHను HCA అడిగగా.. దీనికి ఎస్‌ఆర్‌హెచ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎక్స్‌ట్రా టికెట్ల కోసం HCA బెదిరించిందని SRH ఆరోపిస్తోంది. గత రెండేళ్లుగా ఇలాంటి సమస్యలు కొనసాగుతున్నాయని, ఇక సహించలేమని SRH.. HCA ట్రెజరీకి మెయిల్ చేసిందన్న వార్తలు వచ్చాయి.