Velugoti Rajagopal Yachendra : మాజీ క్రికెటర్ రాజగోపాల్ కన్నుమూత

ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ వెలుగోటి రాజగోపాల్‌ యాచేంద్ర (94) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 10వ  తేదీ గురువారం నెల్లూరులోని తన నివాసంలో కన్నుమూశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన యాచేంద్ర..  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు

New Update
cricket rajagopal

cricket rajagopal

ఆంధ్రా రంజీ జట్టు మాజీ కెప్టెన్‌ వెలుగోటి రాజగోపాల్‌ యాచేంద్ర (94) కన్నుమూశారు. 2025 ఏప్రిల్ 10వ  తేదీ గురువారం నెల్లూరులోని తన నివాసంలో కన్నుమూశారు. తిరుపతి జిల్లా వెంకటగిరి సంస్థానానికి చెందిన యాచేంద్ర..  కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆంధ్ర జట్టు తరఫున ఆయన 15 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన ఆయన1956-57లో ట్రావెన్‌కోర్‌-కొచ్చి జట్టుతో గుంటూరులో జరిగిన మ్యాచ్‌తో రంజీ అరంగేట్రం లోకి  చేశారు.  అంతేకాకుండా1964-65లో హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజగోపాల్‌ కెప్టెన్‌గా వ్యవహరించారు.

Also Read :  Bhadrachalam: ఫోన్‌ పేలో లంచం.. ACBకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన CI

టెన్నిస్‌ క్రీడాకారుడిగానూ మంచి గుర్తింపు

కుడి చేతి వాటం బ్యాటర్‌గానే రాణిస్తూ ఆయన స్పిన్‌తో వికెట్లు పడగొట్టేవారు. రాజగోపాల్‌ తాను ఆడటమే కాకుండా ఆంధ్రలో ఎంతోమంది క్రికెటర్లను తయారు చేశారు. రాజగోపాల్‌ కేవలం ఒక క్రికెటర్ గానే కాకుండా ఓ టెన్నిస్‌ క్రీడాకారుడిగానూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  రాజగోపాల్‌ యాచేంద్ర మృతికి ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శులు కేశినేని శివనాథ్‌ (చిన్ని), సానా సతీష్‌బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన మృతి ఆంధ్రా క్రికెట్‌ సంఘానికి తీరని లోటని పేర్కొన్నారు.  

Also Read : RCB Record : సొంత గ్రౌండ్లో ఆర్సీబీ పరమ చెత్త రికార్డు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు