/rtv/media/media_files/2025/04/19/d0V7nRSq3d6XZuCUQyBe.jpg)
psl match Photograph: (psl match)
ఇండియాలో ఐపీఎల్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సమ్మర్ లో జరిగే ఈ మెగా టోర్నీ కోసం పది జట్లు పోటీ పడుతాయి. దీనికోసం ఆటగాళ్లు మాత్రమే కాదు అభిమానులు కూడా ఎంత అతృతగా ఎదురుచూస్తారు. అయితే ఐపీఎల్కు పోటీగా.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సూపర్ లీగ్ టోర్నీని నిర్వహిస్తుంది. బంగ్లాదేశ్ కూడా ఓ లీగ్ ను రన్ చేస్తోంది. అయితే ఇవి ఐపీఎల్ ముందు సక్సెస్ కాలేదు.
స్టేడియాలకు వెళ్లే వారి సంఖ్య
పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నీ మ్యాచులను చూసేందుకు పాక్ క్రికెట్ అభిమానులు ఆసక్తి చూపట్లేదని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ సూపర్ లీగ్ మ్యాచులు చూసేందుకు స్టేడియాలకు వెళ్లే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. పోని వచ్చినవారు కూడా అక్కడ జరిగే మ్యాచ్ లు చూడకుండా మొబైల్స్ లో ఐపీఎల్ మ్యాచులు చూస్తున్నారని తెలిపాయి. ఈక్రమంలో ఓ అభిమాని ఐపీఎల్ చూసిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశాయి.
#RCBvsPBKS pic.twitter.com/RuaLzGYZKa
— Trolls_official (@trolls_2819) April 18, 2025
కరాచీలో లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ అనే రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ జరిగింది. ప్రేక్షకులు మ్యాచ్ చూడటానికి స్టేడియానికి వచ్చారు, కానీ వారి దృష్టి అంతా ఐపీఎల్ మ్యాచ్ పైనే ఉన్నట్లు అనిపించింది. ఈ మ్యాచ్‌లో ఒక అభిమాని స్టేడియంలో కూర్చుని తన మొబైల్ ఫోన్‌లో ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నట్లు కనిపించాడు. కాగా లాహోర్ ఖలందర్స్ 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేయగా, కరాచీ కింగ్స్ 136 పరుగులకే ఆలౌటైంది.
PSLతో పోలిస్తే IPL ఎల్లప్పుడూ ముందంజలోనే ఉంటుంది. ప్రైజ మనీ నుండి ఆటగాళ్లకు అందించే సౌకర్యాలు, జీతాలు, వేలం నుండి వచ్చే డబ్బు వరకు, IPL తో పోలిస్తే PSLచాలా వెనుకబడి ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి పాకిస్తాన్ ఖచ్చితంగా జీవితకాలం పడుతుంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ కోసం ప్రసారకుడిని వెతకడానికి వారు పడాల్సిన హడావిడి అందరికీ తెలిసిందే.