Virat Kohli: కోహ్లీ కన్నీళ్లు.. చిన్నస్వామి తొక్కిసలాటపై తొలి రియాక్షన్..

ఐపీఎల్ 2025లో ఆర్సీబీ విజయం తర్వాత చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటపై కోహ్లీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది చాలా బాధాకరమైన ఘటన అని, ఈ విజయం ఆనందాన్ని విషాదంగా మార్చిందని పేర్కొన్నారు. మరణించినవారి కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు.

New Update
Virat Kohli first reaction to Bengaluru Chinnaswamy stampede

Virat Kohli first reaction to Bengaluru Chinnaswamy stampede

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఈ ఏడాది తన కళను నెరవేర్చుకుంది. దాదాపు 18 ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకుంది. దీంతో 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ముగింపు పలికింది. ఫైనల్ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌ను ఓడించి ఆర్సీబీ ఈ టైటిల్‌ను గెలుచుకుంది. 

Virat Kohli first reaction

ఈ టైటిల్ గెలిచిన ఆనందం ఆ జట్టుకు ఎక్కువ రోజులు నిలువలేదు. మూడు రోజులకే ఆనందం.. విషాదంగా మారింది. 18ఏళ్ల తర్వాత ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ఆనందంలో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో విజయోత్సవర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే.

ఈ వేడుకకు ఫ్రీ పాస్ కావడంతో స్టేడియం బయట కిక్కిరిసిపోయింది. వేలాది మంది అభిమానులు స్టేడియానికి చేరుకున్నారు. దీంతో వారిని కంట్రోల్ చేయడంలో పోలీసు సిబ్బంది విఫలమైంది. దీని కారణంగా తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో దాదాపు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు.

ఇంకో 56 మంది తీవ్రంగా గాయాలపాలయ్యారు. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటన యావత్ దేశాన్ని కబలించింది. ఈ ఘటనపై కబ్బన్ పార్క్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఇందులో భాగంగానే RCB ఫ్రాంచైజీ, ఈవెంట్ నిర్వాహకులు, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లపై కేసులు నమోదు చేశారు. 

ఇదిలా ఉంటే ఈ తొక్కిసలాట అనంతరం మరణించిన వారి కుటుంబాలకు, గాయపడిన వారికి RCB యాజమాన్యం, కర్ణాటక ప్రభుత్వం ఆర్థిక సహాయం ప్రకటించాయి. RCB ‘‘RCB కేర్స్’’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించి బాధితులకు ఆర్థిక సహాయం అందించింది. 

తొలుత రూ. 10 లక్షలు ప్రకటించింది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తన 'RCB కేర్స్' కార్యక్రమం ద్వారా తొక్కిసలాటలో మరణించిన 11 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికీ రూ. 25 లక్షల ఆర్థిక సహాయాన్ని అనౌన్స్ చేసింది. అలాగే కర్ణాటక ప్రభుత్వం కూడా మరణించినవారి కుటుంబాలకు రూ. 25 లక్షల పరిహారాన్ని ప్రకటించింది.

ఇక ఈ తొక్కిసలాట జరిగి దాదాపు మూడు నెలల తర్వాత RCB మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించారు. ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాదం తమ జట్టు చరిత్రలో భాగమైందని ఆయన పేర్కొన్నారు. జూన్ 4న జరిగిన ఈ విషాద ఘటన తమ ఫ్రాంచైజీ చరిత్రలో అత్యంత సంతోషకరమైన క్షణాన్ని విషాదంగా మార్చిందని కోహ్లీ చెప్పుకొచ్చారు.

మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన తన అభిమానులు త్వరగా కోలుకోవాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ ఘటన తర్వాత తాము మరింత జాగ్రత్తగా, బాధ్యతగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆర్సీబీ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలిపింది. 

Advertisment
తాజా కథనాలు