/rtv/media/media_files/2025/03/10/lhDMdcvPSspQWvKSvpN8.jpg)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా దుబాయ్ స్టేడియంలో టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ తన గర్ల్ ఫ్రెండ్ ఆర్జే మహవాష్ తో కలిసి కనిపించాడు. వీరిద్దరికి సంబంధించిన పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది. దీంతో వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారని త్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీరిద్దరి ఫోటోలు వైరల్ అయిన తర్వాత చాహల్ మాజీ భార్య ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోఆసక్తికరమైన పోస్టు పెట్టారు. మహిళలను నిందించడం ఫ్యాషన్ అయిపోయింది అంటూ ఆమె పోస్టు పెట్టింది. ఈ పోస్ట్ వెంటనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్దీరోజులుగా ధనశ్రీ, యుజ్వేంద్ర విడాకులకు ధరఖాస్తు చేసుకున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తనపై సోషల్ మీడియాలో వచ్చిన కామెంట్స్ పై ధనశ్రీ ఈ విధంగా స్పందించినట్లుగా తెలుస్తోంది.
Chahal bhai ko dusri ladki ke sath dekhte hi Dhanashri Verma ki Insta story #dhanashreeverma#yuzvendrachahalpic.twitter.com/JOTkIvDze2
— बलिया वाले 2.0 (@balliawalebaba) March 10, 2025
అన్‌ఫాలో చేసుకోవడంతో
ధనశ్రీ, యుజ్వేంద్ర ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడంతో వీరి విడాకుల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 2020 డిసెంబర్ 22న వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గత నెలలో చాహల్ న్యాయవాది నితిన్ కె గుప్తా మాట్లాడుతూ వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లుగా ధృవీకరించారు. ధనశ్రీ రూ. 60 కోట్లు భరణం కోరుతున్నట్లు పుకార్లు కూడా వచ్చాయి. ధనశ్రీ వర్మ తన తాజా ఇన్‌స్టాగ్రామ్ లో తోటి కొరియోగ్రాఫర్ ప్రతీక్ ఉటేకర్‌తో ఉన్న ఫొటో వైరల్ గామారడంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు.
గత రెండుసంవత్సరాలలో టీం ఇండియాకు చెందిన ముగ్గురు ఆటగాళ్ళు విడాకులు తీసుకున్నారు. మొదటగా శిఖర్ ధావన్, ఆయేషా ముఖర్జీ విడిపోయారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా నటాషా స్టాంకోవిచ్ తో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ కూడా విడిపోయారు. అయితే, వీరేంద్ర సెహ్వాగ్ వంటి దిగ్గజ ఆటగాడు కూడా విడాకులు తీసుకోబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి కానీ వీటిపై వారు ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also read : ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో.. విడాకుల బాటలో మరో క్రికెటర్!