/rtv/media/media_files/2025/04/20/roMBdTPG3mZphSa28cln.jpg)
mi-vs-csk match
ఐపీఎల్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరుగుతోన్న మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. శివమ్ దూబే (50), రవీంద్ర జడేజా (53*) రాణించారు. ధోనీ (4) నిరాశరపరిచాడు. ముంబై బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా 2, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, మిచెల్ శాంట్నర్ ఒక్కో వికెట్ పడగొట్టారు. దీంతో ముంబై ఇండియన్స్ 177 గా ఉంది.
Fifties from Dube and Jaddu help CSK post a competitive 176/5 ✅#IPL2025 #MIvsCSK pic.twitter.com/qGGhazaNcg
— OneCricket (@OneCricketApp) April 20, 2025
అశ్వనీ కుమార్ బిగ్ షాక్
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టుకు అశ్వనీ కుమార్ బిగ్ షాకిచ్చాడు. తన తొలి ఓవర్లోనే డేంజరస్ ఆటగాడు రచిన్ రవీంద్ర(5)ను ఔట్ చేశాడు. అయితే ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేసిన ఆయుష్ మాత్రే(32) ఆ ఓవరలో వరుసగా 4, 6, 6 బాది తన తడాఖా చూపించాడు. దాంతో, చెన్నై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 48 రన్స్ చేసింది. ఆ తర్వాత పెద్ద షాట్‌కు యత్నించి బౌండరీ లైన్ వద్ద శాంట్నర్ చిక్కాడు.
ఆ కాసేపటికే శాంట్నర్ ఓవర్లో షేక్ రషీద్(19) ఫ్రంట్ ఫుట్ వచ్చి స్టంపౌట్ అయ్యాడు. దీంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత వచ్చిన రవీంద్ర జడేజా(53 నాటౌట్)తో కలిసి శివం దూబే(50) ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. ఇద్దరు కలిసి నాలుగో వికెట్‌కు 79 పరుగులు జోడించారు,. జట్టు స్కోర్ 140 దాటాక దూకుడుగా ఆడుతున్న దూబే ఔటయ్యాడు. ధోనీ త్వరగానే ఔట్ అయినప్పటికీ జడేజా జట్టు స్కోరు పెంచుతూ దూకుడుగా ఆడాడు. దీంతో సీఎస్కే నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.
Also read : Pavani Reddy : మొదటి భర్త ఆత్మహత్య.. రెండో పెళ్లి చేసుకున్న బిగ్ బాస్ బ్యూటీ!