/rtv/media/media_files/2024/12/31/oviDILSXlaWfxd1LT04L.jpg)
Cheapest Recharge Plan
స్మార్ట్‌ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ప్రముఖ టెలికాం సంస్థలు రీఛార్జ్ ధరలను విపరీతంగా పెంచేశాయి. రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ వంటి బడా కంపెనీలు తమ యూజర్లకు గట్టి షాకే ఇచ్చాయి. రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో వినియోగదారులు అల్లాడిపోయారు. అదే సమయంలో ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL తమ వినియోగదారులకు అదిరిపోయే సర్‌ప్రైజ్ అందించింది.
Cheapest Recharge Plan
తక్కువ ధరలకే రీఛార్జ్ ప్లాన్‌లను అందించి ఊరటనిచ్చింది. ఇలా ఎప్పటి కప్పుడు తమ వినియోగదారులకు రీఛార్జ్ ధరలపై ఆఫర్లు ప్రకటించి మరింత మందిని అట్రాక్ట్ చేస్తూ వస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా మరొక అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. BSNL మరో సరసమైన ప్లాన్‌ను ప్రారంభించింది. ఈ ప్లాన్ 30 రోజుల చెల్లుబాటుతో వస్తుంది. ఈ ప్లాన్ ప్రైవేట్ కంపెనీల కంటే దాదాపు 40% చౌకగా ఉంటుంది.
ఈ ప్లాన్‌లో వినియోగదారులు అనేక అదనపు ప్రయోజనాలతో పాటు అపరిమిత కాలింగ్, డేటాను పొందుతారు. కేవలం 225 రూపాయలకు BSNL ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వేసుకుంటే.. ఎన్నో ప్రయోజనాలు పొందుతారు. ఈ ప్లాన్‌లో భారతదేశం అంతటా వినియోగదారులకు అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్, రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటా, రోజుకు 100 SMSలు పొందుతారు.
అలాగే ప్రతి ప్రీపెయిడ్ ప్లాన్‌లో BSNL వినియోగదారులకు BiTV యాప్‌కు ఉచిత యాక్సెస్‌ను అందిస్తుంది. ఇది 350 కి పైగా లైవ్ టీవీ ఛానెల్‌లు, OTT యాప్‌లకు యాక్సెస్‌ను అందిస్తుంది.
ఇదిలా ఉంటే బిఎస్ఎన్ఎల్ ఇటీవల భారతదేశం అంతటా తన 4G సేవను ప్రారంభించింది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ సుమారు 98,000 కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇది వినియోగదారులకు మరింత మెరుగైన నెట్‌వర్క్ కవరేజ్, కనెక్టివిటీని అందిస్తుంది.
Follow Us