ఓటమి ఎఫెక్ట్ :  టీమిండియా ఆటగాళ్లకు బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ

ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఇటీవల ముంబైలో జరిగిన సమీక్ష సమావేశంలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది.

New Update
bcci

bcci Photograph: (bcci )

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో టీమిండియా ఓటమిపై బీసీసీఐ 2025 జనవరి 11న ముంబైలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమీక్షా సమావేశానికి కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ లు హాజరయ్యారు.  సమీక్షలో భాగంగా ఆటగాళ్లకు పనితీరుపై వేరియబుల్ పే స్ట్రక్చర్‌ను ప్రవేశపెట్టాలనే ప్రతిపాదనను బీసీసీఐ సూచించింది.

వేరియబుల్ పే సిస్టమ్‌ అంటే  ఆటగాళ్లు జవాబుదారీగా ఉండటం. అంచనాల కంటే తక్కువగా ప్రదర్శన ఉంటే, ఆటగాడి సంపాదనలో కోత ఉంటుంది. సిరీస్‌లో పేలవమైన ప్రదర్శన చేస్తే ఆటగాళ్లకు చెల్లింపులో బీసీసీఐ కోత విధిస్తుంది అన్నమాట. ఆటగాళ్ళు జవాబుదారీగా ఉండాలని, వారి ప్రదర్శన అంచనాల ప్రకారం సరిపోదని భావించినట్లయితే వారు వేరియబుల్ పే- లను ఎదుర్కోవాలని బీసీసీఐ సూచించినట్లుగా తెలుస్తోంది.

ఈ   వేరియబుల్ పే స్ట్రక్చర్‌ అనేది కొత్తదీ కాదు  దాదాపుగా కార్పొరేట్ కంపెనీలు ఏటా తమ ఉద్యోగులకు ఈ విధమైన సిస్టమ్ ను బెస్ చేసుకుని చెల్లింపులు చేస్తుంది.  ఇప్పుడు ఈ వ్యవస్థను బీసీసీఐ త్వరలో అమలులోకి తీసుకురాబోతోంది. 

టెస్ట్ ఫార్మాట్‌ను ప్రోత్సహించడానికి

గత ఏడాది బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్‌ను ప్రోత్సహించడానికి ఆటగాళ్లకు ప్రోత్సాహక వ్యవస్థను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం 2022-23 నుండి 50 శాతానికి పైగా టెస్టుల్లో పాల్గొన్న ఆటగాళ్లకు ఒక్కో మ్యాచ్‌కు 30 లక్షల ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించింది.  ఒక సీజన్‌లో కనీసం 75 శాతం మ్యాచ్‌లు ఆడే ప్రతి ఆటగాడికి రూ. 45 లక్షలను చెల్లింపుగా అందించింది. 


బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT) 2024-25లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 1-3 తేడాతో ఓడిపోయింది. 2014-15 తర్వాత ఆస్ట్రేలియాపై టీమిండియా టెస్టు సిరీస్ ఓడిపోవడం ఇదే తొలిసారి. దీంతో జూన్‌లో జరగనున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025 ఫైనల్ పోటీ నుండి భారత్ ఔట్ అయింది. డ‌బ్ల్యూటీసీలో మొద‌టిసారి టీమిండియా ఫైనల్‌కు చేరుకోలేక‌పోయింది. 

Also Read :  Sabarimala: నేడే అయ్యప్ప మకరజ్యోతి దర్శనం..శబరిమలకు పోటెత్తిన స్వాములు

 

 

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు