West Indies : అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ ప్రపంచ రికార్డు

వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో..  వెస్టిండీస్ జట్టు ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది.

New Update
wi vs BAN

అంతర్జాతీయ వన్డే క్రికెట్ చరిత్రలో వెస్టిండీస్ జట్టు ఒక అరుదైన ప్రపంచ రికార్డును సృష్టించింది. ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో..  వెస్టిండీస్ జట్టు ఏకంగా 50 ఓవర్ల పాటు కేవలం స్పిన్నర్లతోనే బౌలింగ్ చేసి చరిత్ర సృష్టించింది. వన్డే ఫార్మాట్‌లో ఒక పూర్తిస్థాయి అంతర్జాతీయ జట్టు ఈ ఘనత సాధించడం ఇదే తొలిసారి కావడం విశేషం.  ఇంతకుముందు శ్రీలంక జట్టు మూడు సందర్భాల్లో 44 ఓవర్ల స్పిన్‌ను వేయించడం అత్యధికంగా ఉండేది.

స్పిన్‌కు అనుకూలించే, పొడిగా ఉన్న పిచ్‌ను దృష్టిలో ఉంచుకుని వెస్టిండీస్ కెప్టెన్ షై హోప్ ఈ సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. జట్టులోని ఐదుగురు స్పిన్నర్లు – అకీల్ హోసేన్, రోస్టన్ ఛేజ్, ఖారీ పియర్, గుడకేశ్ మోటీ, అలిక్ అథనేజ్ – తలో 10 ఓవర్లు పూర్తి చేశారు. ఈ స్పిన్ దాటికి బంగ్లాదేశ్ బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు.

ఈ మ్యాచ్ లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  బంగ్లాదేశ్, వెస్టిండీస్ స్పిన్నర్ల ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 213 పరుగులు మాత్రమే చేసింది. సౌమ్య సర్కార్ (45) టాప్ స్కోరర్‌గా నిలవగా, చివర్లో స్పిన్ ఆల్‌రౌండర్ రిషద్ హొస్సేన్ కేవలం 14 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో మెరుపు వేగంతో 39 పరుగులు చేసి స్కోరును 200 దాటించాడు. వెస్టిండీస్ బౌలర్లలోగుడకేశ్ మోటీ 3 వికెట్లు పడగొట్టగా, అలిక్ అథనేజ్ (10 ఓవర్లలో 14 పరుగులు ఇచ్చి 2 వికెట్లు), అకీల్ హోసేన్ (2 వికెట్లు) అద్భుతంగా రాణించారు. 

మ్యాచ్ టై

214 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన వెస్టిండీస్ కూడా 50 ఓవర్లలో 9 వికెట్లకు 213 పరుగులు చేయడంతో మ్యాచ్ టై అయ్యింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. సూపర్ ఓవర్‌లో విండీస్ కేవలం ఒక్క పరుగు తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించి, మూడు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఈ మ్యాచ్ లో మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కలిసి మొత్తం 92 ఓవర్లు స్పిన్‌ను ఉపయోగించాయి, ఇది కూడా వన్డే చరిత్రలోనే అత్యధికం.  

Advertisment
తాజా కథనాలు