Gambir: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భారత జట్టు పేలవ ప్రదర్శనపై కోచ్ గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. డ్రెస్సింగ్ రూమ్‌లో పంత్‌తో పాటు సీనియర్లపై కూడా ఇక చాలంటూ తీవ్ర అసహనం చూపించారని టాక్ వినిపిస్తోంది. రిపీట్ అయితే వేటు తప్పదంటూ హెచ్చరించారట.
ఇక చాలు ఆపండి..
ఈ మేరకు మెల్‌బోర్న్ బాక్సింగ్ టెస్టు ఓటమి అనంతరం డ్రెస్సింగ్ రూమ్ లో మీటింగ్ ఏర్పాటు చేసిన గంభీర్.. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. గెలవాల్సిన నాలుగో టెస్టులో దారుణంగా విఫలమైన స్టార్ ఆటగాళ్లను సైతం హెచ్చరించారు. పంత్ చెత్త షాట్ ఆడటంతోపాటు కనీసం క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం కేటాయించకపోయినా బ్యాటర్లపై ఫైర్ అయ్యారట. ఇక బౌలర్ల విషయంలోనూ బుమ్రా మినహా పెద్దగా ఎవరూ స్థాయికితగ్గ ప్రదర్శన చేయలేదని క్లాస్ తీసుకున్నారట. ఆరు నెలలు స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ ఎవరూ దానిని నిలబెట్టుకోలేకపోతున్నారని, ఇకపై ఇలా వాతావరణం ఇలా ఉండదని హెచ్చరించారట. ఇప్పటినుంచి జట్టు వ్యూహాలకనుగుణంగా ఆడనివారిపై తప్పకుండా వేటు పడుతుందని వార్నింగ్ ఇచ్చారట.
పూజారా కావాలి..
ఈ క్రమంలోనే పుజారా అవసరాన్ని గుర్తించిన గంభీర్ అతన్ని జట్టులోకి తీసుకోవాలనే ప్రతిపాదన తీసుకొచ్చారట. కానీ సెలక్షన్ కమిటీ పుజారను తీసుకునేందుకు విముఖత చూపించినట్లు సమాచారం. రాహుల్ ద్రవిడ్ తర్వాత హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన గంభీర్ వరుస పరాజయాలతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాడట. శ్రీలంకతో వన్డే సిరీస్, న్యూజిలాండ్‌పై వైట్‌వాష్, బోర్డర్ గావస్కర్ ట్రోఫీ వైఫల్యాల కారణంగా గంభీర్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.