Bumrah: రవూఫ్ కు దిమ్మతిరిగే రిప్లై.. ఫ్లైట్ సైగలతో బుమ్రా..

పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు. 

New Update
bumrah

పాకిస్తాన్ ప్లేయర్ రవూఫ్ ఇంతకు ముందు మ్యాచ్ లో ఫైట్ డౌన్ సైగ చేస్తూ వివాదాలకు దారితీశాడు. ఈ రోజు బుమ్రా అతని వికెట్ తీసినప్పుడు అదే సైగను చేస్తూ అతనికి రిప్లై ఇచ్చాడు. 
అంతకు ముందు మ్యాచ్ లో రవూఫ్ రవూఫ్ గతంలో వివాదాస్పదమైన "6-0" చేతి సంజ్ఞను చేసి, ఫైటర్ జెట్ కూలిపోవడాన్ని అనుకరించాడు. ఆపరేషన్ సింధూర్ లో  పాకిస్తాన్ సైన్యం భారత జెట్లను కూల్చిందనే అర్ధంలో సైగ చేశాడు. ఈరోజు మ్యాచ్ లో బుమ్రా రవూఫ్ వికెట్ తీసినప్పుడు అదే సైగ చేస్తూ దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చాడు. సోషల్ మీడియాలో ఈ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. 

ఐసీసీ వార్నింగ్...

భారత్‌తో జరిగిన గత మ్యాచ్‌లో పాక్ ప్లేయర్లు హారిస్ రౌఫ్, సాహిబ్‌జాదా ఫర్హాన్  వింత చర్యలతో హాట్ టాపిక్‌గా మారారు. భారత్‌తో రెండో సారి తలపడిన మ్యాచ్‌లో పాక్ ఓపెనింగ్ బ్యాటర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ సాధించిన తర్వాత తన బ్యాట్‌ను గన్ లా పైకి ఎత్తి పేల్చినట్లు సంబరాలు చేసుకున్నాడు. ఆ తర్వాత మరో పాక్ ప్లేయర్ బౌలర్ హారిస్ రౌఫ్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో విమానాలను నేల కూల్చినట్లు సైగలు చేశాడు. ఈ వింత చర్యలపై భారత్ క్రికెట్ ఫ్యాన్స్‌తో పాటు బీసీసీఐ సైతం తీవ్ర ఆగ్రహానికి గురైంది. ఇందులో భాగంగా పాక్ ప్లేయర్లు చేసి వింత చర్యలకు అభ్యంతరం వ్యక్తం చేసి మ్యాచ్ రిఫరీకి కంప్లైంట్ ఇచ్చింది. 

దీనిపై దర్యాప్తు చేసిన తర్వాత ఐసీసీ కీలక చర్య తీసుకుంది. హారిస్ రవూఫ్‌కు మ్యాచ్ ఫీజులో 30 % జరిమానా విధించింది. అతడి చర్యలు, హావభావాలు ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ ఐసీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే రవూఫ్‌పై ఎలాంటి నిషేధం విధించలేదు. దీని కారణంగా అతడు భారత్‌తో ఫైనల్ మ్యాచ్‌లో ఆడబోతున్నాడు. మరోవైపు బ్యాట్స్‌మన్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ తుపాకీ వేడుకలపై ఐసీసీ ఎలాంటి చర్య తీసుకోలేదు. కానీ అతడిని హెచ్చరించింది.

Advertisment
తాజా కథనాలు