Anuska Sharma: అవునా నిజమా.. అనుష్క శర్మ డ్రెస్ ధర అన్ని వేలా?.. తెలిస్తే కళ్లుతిరగాల్సిందే భయ్యా!

పంజాబ్‌తో ఫైనల్‌ మ్యాచ్‌లో విరాట్ భార్య, నటి అనుష్క శర్మ డ్రెస్ అట్రాక్షన్‌గా నిలిచింది. కాటన్ వైట్ షర్ట్, రైన్‌స్టోన్ జీన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ డ్రెస్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. దుస్తుల మొత్తం ధర సుమారు రూ.86,184గా అంచనా వేయబడింది.

New Update
ANUSKA SHARMA DRESS PRICE

ANUSKA SHARMA DRESS PRICE

జూన్ 3న RCB vs PBKS మధ్య జరిగిన IPL 2025 ఫైనల్‌లో విరాట్ కోహ్లీ భార్య, నటి అనుష్క శర్మ అట్రాక్షన్‌గా నిలిచింది. ఆమె స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షించింది. మ్యాచ్‌ గెలిచిన అనంతరం విరాట్ కోహ్లీతో అనుష్క శర్మ అందమైన క్షణాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Anushka Sharma dress price

ముఖ్యంగా అనుష్క శర్మ డ్రెస్ క్రికెట్ ప్రియులను బాగా అట్రాక్ట్ చేసింది. డెనిమ్ లుక్‌తో తన సిగ్నేచర్ వైట్ షర్ట్‌‌లో కనిపించి క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంది. బ్లూ కలర్ జీన్ ప్యాట్, వైట్ షర్ట్‌తో స్టైలిష్‌గా కనిపించి కనువిందు చేసింది. దీంతో అనుష్క డ్రెస్ ధర ఎంత ఉంటుందా? అని నెటిజన్లు తెగ వెతికేస్తున్నారు. 

ఆ డ్రెస్ ధర తెలిసి అంతా షాక్ అవుతున్నారు. అనుష్క శర్మ క్లోసెట్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రకారం.. నటి కాటన్ వైట్ షర్ట్ అలెగ్జాండర్ వాంగ్ అనే లేబుల్ నుండి వచ్చింది. దీని ధర రూ.48,418.35గా ఉన్నట్లు తెలిసింది. అదే సమయంలో ఆమె రైన్‌స్టోన్ జీన్స్ సాండ్రో పారిస్ అఫీషియల్ నుండి వచ్చింది. దీని ధర సుమారు రూ.35,766.00 వరకు ఉన్నట్లు సమాచారం. దీంతో ఆమె దుస్తుల మొత్తం ధర సుమారు రూ.86,184గా అంచనా వేయబడింది.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు