Ajinkya Rahane: ఆగలేకపోతున్నా.. సవాల్ కు సిద్ధంగా ఉన్నా: కేకేఆర్‌ కెప్టెన్‌ రహానె రియాక్షన్

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ కెప్టెన్ బాధ్యతలు తనకు అప్పగించడంపై అజింక్య రహానె హ్యాపీగా ఫీలయ్యాడు. ‘‘కేకేఆర్‌కు కెప్టెన్‌గా ఉండటం నాకు గర్వకారణం. టైటిల్ నిలబెట్టుకోవడం సవాల్‌తో కూడుకున్న పని. ఆ సవాలుకు మేము సిద్ధంగా ఉన్నాం’’ అని కేకేఆర్ కెప్టెన్ తెలిపాడు.

New Update
Ajinkya Rahane excited to lead KKR in IPL 2025

Ajinkya Rahane excited to lead KKR in IPL 2025

ఐపీఎల్ 2025 సీజన్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. దీనికోసం ఆయా జట్లు సిద్ధమయ్యాయి. ఇందులో భాగంగానే గతేడాది డిఫెండింగ్ ఛాంపియన్ గా నిలిచిన కోల్ కతా నైట్ రైడర్స్ బరిలోకి దిగుతోంది. అయితే గత సీజన్ లో శ్రేయస్ అయ్యర్ నాయకత్వంలో ఐపీఎల్ టైటిల్ ను సొంతం చేసుకున్న కేకేఆర్ ఈ ఏడాదిలో మాత్రం అతడిని రిటైన్ చేసుకోలేదు. గత మెగా వేలంలో శ్రేయస్ ను బదులుగా సీనియర్ ప్లేయర్ అజింక్య రహానెను రూ.1.50 కోట్లకు దక్కించుకుంది.

Also Read : అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణవాసుల మృతి..

రహానె రియాక్షన్

అంతేకాకుండా రహానెకు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఇక తనకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై రహానె తాజాగా స్పందించాడు. ఈ మేరకు అతడు హ్యాపీగా ఫీలయ్యాడు. కేకేఆర్ కు సారథిగా ఉండటం తనకు గర్వకారణమని అన్నాడు. ఇప్పుడు తనముందు పెద్ద సవాల్ ఉందని తెలిపాడు. ముఖ్యంగా టైటిల్ ను నిలబెట్టుకోవడం సవాల్ తో కూడుకున్న పని అని చెప్పాడు. 

Also Read : నేడు ఈ రాశివారు నమ్మిన వారే మోసం చేసే అవకాశాలున్నాయి..జర జాగ్రత్త!

అయితే ఎలాంటి సవాల్ కి అయినా తాము సిద్ధంగా ఉన్నట్లు రహానె తెలిపాడు. గత సీజన్ లో టైటిల్ సాధించామని.. అయితే దాన్ని తానెప్పుడూ సాధారణ విషయంగానే చూస్తానని అన్నాడు. తమ ఆటగాళ్లతో తనకు బాగా కమ్యూనికేషన్ ఉందని తెలిపాడు. గ్రౌండ్ లో తమ భావాలను వ్యక్తపరచడానికి తమ ప్లేయర్లకు స్వేచ్చనిస్తానని.. అందరినీ అర్థం చేసుకుంటానని తెలిపాడు.

Also Read: మళ్ళీ మొదలైన ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం..59 మంది మృతి

ఐపీఎల్ 2025 సీజన్ లో మళ్లీ విజేతగా నిలిచేలా ఆడతాం అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్‌లో తమ టీం కచ్చితంగా ఉత్తమ ప్రతిభ కనబరుస్తామని.. తనకు ఆ నమ్మకం ఉందని అన్నాడు. ఇంతటి గొప్ప అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు మేనేజ్ మెంట్ కు ధన్యవాదాలు తెలిపాడు. ఇకపోతే ఈ ఐపీఎల్ 2025 సీజన్‌ మార్చి 22 నుంచి ప్రారంభం అవుతుంది. ఈడెన్‌ గార్డెన్స్‌లో తొలి మ్యాచ్ కోల్‌కతా, బెంగళూరు జట్ల మధ్య జరగనుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు