Abhishek sharma : బంగ్లాకు బ్యాండ్ బాజా.. ఉతికారేసిన అభిషేక్

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.

New Update
abhishek

దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్ లో టీమిండియా అదరగొడుతుంది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 12 ఓవర్‌లో 4 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. ఓపెనర్లు అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌  మంచి శుభారంబాన్ని ఇచ్చారు. ఇద్దరు కలిసి 77 పరుగులు జోడించారు. ఫోర్లు, సిక్సర్లతో అదరగొట్టారు. 77 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ (29) పరుగులకు ఔటయ్యాడు. కానీ అభిషేక్‌ శర్మ మాత్రం బంగ్లా బౌలర్లకు చుక్కలు చూపించాడు.

ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లు

ఎడాపెడా సిక్సర్లు, ఫోర్లతో హోరెత్తించాడు. ఈ క్రమంలోనే  25 బంతుల్లోనే అభిషేక్ శర్మ హాఫ్‌ సెంచరీ కంప్లీట్ చేశాడు. దూకుడుగా ఆడుతున్న అభిషేక్ శర్మ (75) పరుగుల వద్ద రనౌటయ్యాడు.  స్ట్రైకింగ్‌లో ఉన్న సూర్య సింగిల్ కోసం ముందుకు వచ్చి తర్వాత వెనక్కి తగ్గాడు.అప్పటికే సగం దూరం వచ్చిన అభిషేక్ మళ్లీ నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌ వైపు పరుగెత్తి రనౌటయ్యాడు. అభిషేక్ మరికొద్దిసేపు క్రీజులో ఉంటే స్కోరు బోర్డు ఇంకా వేగంగా వెళ్లేది.  అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ లో 6 ఫోర్లు,5 సిక్సులున్నాయి. 

Advertisment
తాజా కథనాలు