Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. సమయం దగ్గరపడుతున్నా టోర్నీ షెడ్యూల్ పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోవడంతో క్రికెట్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. పాకిస్థాన్ వేదికగా జరిపించేందుకు ఐసీసీ సన్నాహాకాలు చేస్తుండగా.. దీనికి భారత్ అంగీకరించపోవడంతోపాటు పాక్ వెళ్లలేమని తేల్చి చెప్పింది. కానీ ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లోనే నిర్వహిస్తామని పీసీబీ పట్టుబడుతోంది. ఈ క్రమంలోనే భారత్ రిజెక్ట్ కారణంగా షెడ్యూలింగ్‌లో మార్పులు తలెత్తడంతో టోర్నీనే రద్దు చేసే దిశగా ఐసీసీ భావిస్తున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఇది కూడా చదవండి: BJP Manifesto: మహారాష్ట్రలో బీజేపీ మేనిఫెస్టో విడుదల.. కీలక అంశాలు ఇవే
హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకారం..
నిజానికి వంద రోజుల కౌంట్‌డౌన్ మొదలుకావాల్సి ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక టోర్నీని రద్దు చేయడం లేదా వాయిదా వేయాలనే ఐసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పీసీబీ అంగీకరింలేదు. దీంతో భారత తీమ్ పాకిస్థాన్‌కు పంపించబోమని బీసీసీఐ వెల్లడించింది. దీంతో ఐసీసీ అయోమయంలో పడిపోయింది. ‘ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ఖరారు చేయలేదు. పాక్ తో పాటు ఇందులో పాల్గొనే జట్లతో సంప్రదింపులు జరుపుతున్నాం. నిర్ణయం తీసుకోగానే అధికారికంగా ప్రకటిస్తాం. ఒకవేళ షెడ్యూల్ కుదరకపోతే టోర్నీ రద్దు చేయడం లేదా వాయిదా వేస్తాం’ అని ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి.
ఇది కూడా చదవండి: Viral: అమ్మాయి ధైర్యానికి సలామ్.. నాలుగు పులులతో ఏం చేసిందో చూడండి
ఇక 2025 ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణకు ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే ఐసీసీకి పీసీబీ సమర్పించింది. భారత మ్యాచ్‌ల కోసం హైబ్రిడ్ మోడల్‌ను తీసుకురావాలని ప్రతిపాదనలూ వచ్చాయి. వీటికీ పాక్ బోర్డ్ అంగీకరించపోవడంతో ఉత్కంఠ నెలకొంది.