/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/trains-1-jpg.webp)
తెలుగు రాష్ట్రాల్లో సోమవారం ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు వెళ్లిన ఓటర్లు తిరుగు ప్రయాణమవుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలును నడిపించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. విశాఖ నుంచి సాయంత్రం 4.15 గంటలకు బయలుదేరనున్న రైలు.. మరుసటిరోజు ఉదయం 6.15 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. అలాగే బుధవారం నాడు సికింద్రాబాద్ నుంచి విశాఖకు ఉదయం 10.30 గంటలకు ప్రత్యేక రైలు బయలుదేరి రాత్రి 11.30లకు గమ్యస్థానం చేరుకోనుంది.
Also Read: పిఠాపురంలో రికార్డ్ బద్దలు.. ఓటర్ల సునామీ. గెలిచేదెవరో మరి!