HBD Jr NTR : ఆ విషయంలో ఎన్టీఆర్ వరల్డ్ లోనే నంబర్ వన్!

ఎన్టీఆర్ ఓ విషయంలో తోటి స్టార్స్ కంటే వరల్డ్ లోనే నెంబర్ వన్ అని నిరూపించాడు. అదే సినిమా సినిమాకి మధ్య ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్. 'నిన్ను చూడాలని' నుంచి త్వరలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'దేవర' వరకు చూసుకుంటే ఎన్టీఆర్ లో సినిమా సినిమాకి డిఫరెంట్ మేకోవర్ కనిపిస్తుంది.

HBD Jr NTR : ఆ విషయంలో ఎన్టీఆర్ వరల్డ్ లోనే నంబర్ వన్!
New Update

Junior NTR Birthday Special Story : తెలుగు సినీ పరిశ్రమ (Tollywood Film Industry) లో నందమూరి లెగసీని కంటిన్యూ చేస్తూ గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఏకైక హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr. NTR). ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్స్ ఉన్నా ఎన్టీఆర్ మాత్రం ఓ తనకంటూ ఓ సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసుకుని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నాడు. సామాన్యులే కాదు ఇండస్ట్రీలో ఎక్కువ మంది అభిమానించే హీరో కూడా ఎన్టీఆరే. ఎలాంటి పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసి తన యాక్టింగ్, డాన్స్ తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ నందమూరి హీరో మే 20న తన పుట్టినరోజు (Birthday) జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా తారక్ గురించి స్పెషల్ స్టోరీ.. ఇండస్ట్రీలో తన నటన, డాన్స్, వ్యక్తిత్వంతో తాతకు తగ్గ మనవడు అనిపించుకున్న ఎన్టీఆర్ కేవలం 17 ఏళ్లకే మాస్ ఆడియన్స్ లో భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు.

publive-image

తారక్ ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లకు పైగా అవుతోంది. ఈ 20 ఏళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. వాటన్నిటినీ అధిగమించి ఈరోజు దేశం గర్వించదగ్గ నటుడు అనిపించుకున్నాడు. ఎన్టీఆర్ తర్వాత ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చి స్టార్స్ అయ్యారు. కానీ ఓ విషయంలో వాళ్ళందరి కంటే తారక్ వరల్డ్ లోనే నెంబర్ వన్ అని నిరూపించాడు. అదే సినిమా సినిమాకి మధ్య ఎన్టీఆర్ చూపించిన వేరియేషన్. తారక్ ఫస్ట్ మూవీ 'నిన్ను చూడాలని' నుంచి త్వరలో రాబోతున్న లేటెస్ట్ మూవీ 'దేవర' వరకు చూసుకుంటే ఎన్టీఆర్ లో సినిమా సినిమాకి డిఫరెంట్ మేకోవర్ కనిపిస్తుంది. తారక్ 19 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్, ఆది, సింహాద్రి వంటి సినిమాలు తో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నాడు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించాడు. ఆ తర్వాత వచ్చిన సుబ్బు, అల్లరిరాముడు, ఆంధ్రావాలా, నా అల్లుడు, నరసింహుడు, అశోక్ సినిమాల్లో అయితే మరింత లావుగా కనిపించాడు.

publive-image

Also Read : బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ షాకింగ్ డెసిషన్.. సినిమాలకు కంగనా రనౌత్ గుడ్ బై?

ఈ సినిమాలన్నీ కూడా ప్లాప్స్ అవడంతో ఎన్టీఆర్ పై ఎన్నో విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ ఆకారం విషయంలో ఎంతోమంది ఇండస్ట్రీ వాళ్లే నెగిటివ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ఎప్పటికీ లావు తగ్గలేడని అందరూ అనుకుంటున్నా సమయంలో రాజమౌళి ఎన్టీఆర్ రూపురేఖల్ని మార్చేసాడు. ఆయన డైరెక్ట్ చేసిన 'యమదొంగ' సినిమాలో ఎన్టీఆర్ స్లిమ్ గా కనిపించి షాక్ ఇచ్చాడు. దాని తర్వాత వచ్చిన 'అదుర్స్' లో అయితే బ్రాహ్మణుడి గెటప్ లో ఆకట్టుకున్నాడు. నెక్స్ట్ మూవీ 'బృందావనం' లోనూ స్టైలిష్ లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని కనువిందు చేశాడు. అప్పటిదాకా స్లిమ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ 'టెంపర్' సినిమాతో బీస్ట్ మోడ్ లోకి మారాడు. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారక్ సిక్స్ ప్యాక్ బాడీలో కనిపించి ఫ్యాన్స్ ని ఫిధా చేసాడు. ఇక 'నాన్నకు ప్రేమతో' సినిమాలో అయితే డిఫరెంట్ హెయిర్ స్టైల్ హాఫ్ బియర్డ్ మెకోవర్ తో అందరినీ ఆశ్చర్యపరిచాడు.

publive-image

సినిమాలో ఎన్టీఆర్ మైంటైన్ చేసిన ఆ లుక్ ని ఎంతోమంది సెలబ్రిటీలు ఫాలో అయ్యారు. ఇక తర్వాత వచ్చిన 'జనతా గ్యారేజ్' లో ఫుల్ బియర్డ్ తో క్లాస్ లోకి మారాడు. ఆ తర్వాత వచ్చిన 'జై లవకుశ' లో అయితే ఏకంగా ట్రిపుల్ రోల్ చేసి అలరించాడు. అందులో చేసిన విలన్ రోల్ లో తారక్ కోర మీసాలతో కనిపించాడు. దాని తర్వాత వచ్చిన 'అరవింద సమేత' మూవీ లో షర్ట్ లేకుండా ఫైట్ చేసి మరోసారి సిక్స్ ప్యాక్ బాడీలో ఫ్యాన్స్ ను ఆకట్టుకున్నాడు. ఇక రామ్ చరణ్ తో కలిసి నటించిన 'RRR' లో అయితే డిఫరెంట్ వేరియేషన్స్ చూపించాడు.

publive-image

సినిమాలో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ లుక్ అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకుంది. ఇక త్వరలో రాబోయే 'దేవర' (Devara) లో అయితే రింగుల జుట్టు, కోర మీసాలతో మరో సరికొత్త మేకోవర్ తో అలరించేందుకు సిద్ధమవుతున్నాడు ఈ నందమూరి హీరో. అలా తన సినీ కెరియర్లో సినిమా సినిమాకి మధ్య తన ఆహార్యాన్ని మార్చుకుంటూ వచ్చాడు ఎన్టీఆర్. ఆయనలా ఇప్పటివరకు మరే హీరో లుక్స్ పరంగా సినిమా సినిమాకి మధ్య ఇంత వేరియేషన్ చూపించలేదు. అందుకే ఈ ఒక్క విషయంలో మాత్రం ఎన్టీఆర్ వరల్డ్ లోనే నెంబర్ వన్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఇక రాబోయే రోజుల్లోనూ తారక్ మరెన్నో డిఫరెంట్ మెకోవర్స్ తో ఆడియన్స్ ని అలరించాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టూ యంగ్ టైగర్ ఎన్టీఆర్...

publive-image

#hbd-jr-ntr #tollywood #ntr #junior-ntr-birth-day-special
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి