Nizamabad Serial Murders Case: నిజామాబాద్ వరుస హత్యల ఇష్యూ దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. కాగా ఈ కేసును సీరియస్ గా తీసుకున్న తెలంగాణ పోలీసులు సీరియల్ కిల్లర్ ప్రశాంత్ నేర చరిత్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ప్రస్తుతం కస్టడీలో ఉన్న నిందితుడు ప్రశాంత్ (Prashanth) నుంచి పూర్తి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడిస్తామన్నారు.
ఈ మేరకు మాక్లూర్ మండలం మదనపల్లికి చేరుకున్న పోలీస్, రెవెన్యూ, ఫోరెన్సిక్ అధికారులు మీడియాతో మాట్లాడుతూ.. ప్రశాంత్ తోపాటు ఇందులో ప్రమేయం ఉన్న నిందితులను మూడ్రోజుల కిందటే కస్టడీలోకి తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ప్రసాద్ (Prasad) డెడ్‌బాడీనీ వెలికితీసి పంచనామా నిర్వహించిన పోలీసులు.. ప్రసాద్ భార్య రమణి మృతదేహం ఇంకా లభ్యం కాలేదని, ఆమె డెడ్‌బాడీ కోసం వివరాలు సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఒక్కడే 3 హత్యలు :
ఇక స్నేహితుడు ప్రశాంత్ ఆస్తి కోసమో కుటుంబాన్ని హతమార్చిన ప్రధాన నిందితుడు ప్రశాంత్.. ఈ 6 హత్యల్లో మూడు హత్యలను ఒక్కడే చేయగా.. మరో మూడు హత్యలకు ప్రశాంత్ తల్లి, తన సోదరుడు, మరో ఇద్దరు యువకుల సహాయం తీసుకున్నాడు. ప్రస్తుతం ఈ ఐదుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించామని కామారెడ్డి పోలీసులు తెలిపారు. అయితే నేరం బయటపడకుండా ఒక్కొక్కరిని ఒక్కోచోట కాల్చి చంపినట్లు ప్రశాంత్ ఈ దారుణానికి సంబంధించి సంచటన విషయాలు బయటపెడుతున్నాడు. 3 హత్యలు ఒక్కడినే చేశానని, మరో 3 హత్యల్లో ఫ్రెండ్స్ హెల్ప్ తీసుకున్నట్లు వెల్లడించాడు. మొదటిగా హత్య చేసిన ఫ్రెండ్ ప్రసాద్ డెడ్‌బాడీని అటవీ ప్రాంతంలో పాతిపెట్టినట్టు చెప్పాడు. తర్వాత ప్రసాద్ భార్య మెడకు తాడి బిగించి ఊపిరాకుండా చేసిన చంపి సంచిలో కట్టి బాసర బ్రిడ్జిపై నుంచి గోదావరిలో పడేసినట్టు అంగీకరించాడని అధికారులు తెలిపారు.
ఆస్తి దక్కించుకోవడానికి హత్యలు :
అప్పులు తీర్చుకునేందుకు ప్రశాంత్ నుంచి రూ.3.50 లక్షలు బాధితుడు అప్పుగా తీసుకున్నాడు. అయితే అప్పు తీర్చాలని ప్రశాంత్ అడగడంతో మాక్లూర్‌లోని ఇంటిని తాకట్టుపెట్టి చెల్లిస్తానని ప్రసాద్ చెప్పాడు. దీంతో రూ.25లక్షల విలువ జేసే ఆ ఇంటిని సొంతం చేసుకునేందుకు ప్లాన్ చేసిన ప్రశాంత్.. తన పేరుతో ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. అయితే మిగిలిన డబ్బులు ఇవ్వకపోగా ప్రశ్నించిన ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేశాడు. ఈ కేసులో దుర్గానగర్‌కు చెందిన మరో ఇద్దరు యువకులతో హత్యల ప్రమేయం ఉన్నట్లు విచారణలో తేలిందని, మరిన్ని విషయాలు బయటపడనున్నాయని పోలీసులు స్పష్టం చేశారు.