Elon MusK: స్టార్‌షిప్‌ రాకెట్ ప్రయోగం రెండుసార్లు విఫలం.. కొత్త వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్..

ఇటీవల స్పెస్‌ఎక్స్‌ చేపట్టిన స్టార్‌షిప్‌ రాకెట్‌ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పేస్‌ఎక్స్‌ సీఈఓ ఎలాన్ మస్క్‌ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ భారీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

Elon Musk : స్పేస్ ఎక్స్‌ మీద ఇంజనీర్ల దావా.. పిల్లలను కనాలని మస్క్ తమను వేధించాడంటున్న ఉద్యోగినులు
New Update

గత రెండు రోజుల క్రితం ప్రముఖ స్పేస్‌ఎక్‌ కంపెనీ ప్రతిష్ఠా్త్మకంగా ప్రయోగించిన స్టార్‌షిప్ అనే రాకెట్‌ ప్రయోగం రెండోసారి విఫలమైన సంగతి తెలిసిందే. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్‌ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టిన అనంతరం ఈ స్టార్‌షిప్‌ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కానీ తర్వాత బూస్టర్‌ విడిపోయి పేలిపోవడం, అలాగే స్పేస్‌క్రాఫ్ట్‌ కూడా ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది. దీంతో రాకెట్‌ దారితప్పకుండా ఉంచేందుకు దాన్ని పేల్చేయండంతో.. స్పేస్‌ఎక్స్‌ చేపట్టిన రెండో రాకెట్ ప్రయోగం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌ స్టార్‌షిప్‌ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ను ప్రయోగించగా అది విఫలమైంది. మనం నేర్చుకునే దాని నుంచే విజయం వస్తుందని.. ఈరోజు జరిగిన ప్రయోగం.. స్టార్‌షిప్‌ విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడుతుందంటూ స్పేస్‌ఎక్స్‌ కూడా ట్వీట్‌ చేసింది.

Also read: విశాఖ ఫిషింగ్ హర్బర్‌ ప్రమాదం వెనుక యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని..!

ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా పేరున్న ఈ స్టార్‌షిప్ రాకెట్‌ను.. చందమామ, అంగారకుడిపై యాత్రలు చేసేందుకు స్పేస్‌ఎక్స్‌ తయారుచేసింది. అయితే ఎప్పుడూ ట్విట్టర్‌లో చురుకుగా, తనదైన శైలిలో ట్వీట్లు చేసే ఎలాన్‌మస్క్‌ తాజాగా ఓ రాకెట్ వీడియోను తన ఎక్స్‌(ట్విట్టర్‌)లో పోస్టు చేశాడు. ఓ భారీ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్తుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది. స్టార్‌షిప్‌ రెండుసార్లు విఫలం కావడంతో.. మూడోసారి ప్రయోగం చేపట్టేందుకు మస్క్‌ సిద్ధమైపోతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇది భవిష్యత్తు అంతరిక్ష అన్వేషణ అంటూ ఈ వీడియోకు నెటీజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియో చూసేయ్యండి.

Also Read: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. సీఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన లెక్కలివే!

#telugu-news #elon-musk #spacex
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe