గత రెండు రోజుల క్రితం ప్రముఖ స్పేస్‌ఎక్ కంపెనీ ప్రతిష్ఠా్త్మకంగా ప్రయోగించిన స్టార్‌షిప్ అనే రాకెట్ ప్రయోగం రెండోసారి విఫలమైన సంగతి తెలిసిందే. టెస్ట్‌ఫ్లైట్‌లో భాగంగా శనివారం ఉదయం దక్షిణ టెక్సాస్ తీరం నుంచి ఈ ప్రయోగాన్ని చేపట్టిన అనంతరం ఈ స్టార్‌షిప్ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది. కానీ తర్వాత బూస్టర్ విడిపోయి పేలిపోవడం, అలాగే స్పేస్‌క్రాఫ్ట్ కూడా ముందుకు వెళ్లిన కొన్ని నిమిషాలకే కమ్యూనికేషన్ తెగిపోయింది. దీంతో రాకెట్ దారితప్పకుండా ఉంచేందుకు దాన్ని పేల్చేయండంతో.. స్పేస్‌ఎక్స్ చేపట్టిన రెండో రాకెట్ ప్రయోగం కూడా ఫెయిల్ అయిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్ స్టార్‌షిప్ మొదటి టెస్ట్‌ఫ్లైట్‌ను ప్రయోగించగా అది విఫలమైంది. మనం నేర్చుకునే దాని నుంచే విజయం వస్తుందని.. ఈరోజు జరిగిన ప్రయోగం.. స్టార్‌షిప్ విశ్వసనీయతను మెరుగుపరచడంలో సహాయపడుతుందంటూ స్పేస్‌ఎక్స్ కూడా ట్వీట్ చేసింది.
పూర్తిగా చదవండి..Elon MusK: స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండుసార్లు విఫలం.. కొత్త వీడియో షేర్ చేసిన ఎలాన్ మస్క్..
ఇటీవల స్పెస్‌ఎక్స్ చేపట్టిన స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం రెండోసారి కూడా విఫలమైన సంగతి తెలిసిందే. అయితే తాజాగా స్పేస్‌ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ ఎక్స్‌లో ఓ వీడియోను పోస్టు చేశారు. ఓ భారీ రాకెట్ నింగిలోకి దూసుకెళ్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తోంది.

Translate this News: