Monsoon Will Be Enter Into Kerala : భారతీయ వాతావరణశాఖ (IMD) కీలక అప్‌డేట్ ఇచ్చింది. నైరుతీ రుతుపవనాలు.. కేరళ (Kerala) తీరాన్ని మే 31వ తేదీ వరకు చేరే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ పేర్కొంది. నాలుగు రోజులు ముందుగానీ, లేక ఆలస్యంగా కానీ నైరుతీ రుతుపవనాలు (Southwest Monsoon) కేరళలోకి ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. జూన్ నెలలో వర్షాలు విస్తారంగా కురిసే ఛాన్సు ఉన్నట్లు ఐఎండీ వివరించింది.
ఇదిలా ఉంటే ఉత్తర భారతంలోని కొన్ని రాష్ట్రాలకు ఐఎండీ హీట్ వేవ్ వార్నింగ్ ఇచ్చింది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, యూపీ రాష్ట్రాల్లో తీవ్రమైన ఎండలు ఉంటాయని తెలిపింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.
ఈ రాష్ట్రాల్లో తీవ్రమైన వడగాలులు ఉన్నాయి.
ప్రస్తుతం కేరళలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు (Rains) కురుస్తున్నాయి. గురువారం కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. తిరువనంతపురంలో మంగళవారం రాత్రి నుంచి వర్షం కురుస్తోంది. తిరువనంతపురంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం పడుతూనే ఉంది. పాతానమిట్ట, ఇడుక్కీ జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. మరో 8 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. ప్రస్తుతం కేరళ తీరం వెంట చేపల వేటను నిషేందించారు.
Also read: బూత్ లో ఏం జరిగిందంటే.. టీడీపీ ఏజెంట్ శేషగిరి సంచలన విషయాలు!