AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

New Update
AP : ఏపీలోకి రుతుపవనాలు... ఉదయం నుంచే పలు జిల్లాల్లో వర్షాలు!

Monsoon : ఏపీ (AP) లో గత కొద్ది రోజులుగా ఎండ వేడి... ఉక్కబోతతో ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలోనే గత రెండు రోజులుగా నైరుతి రుతుపవనాలు (Southwest Monsoon) దేశంలో చురుగ్గా కదులుతున్నాయి. మే 30 నే కేరళ (Kerala) ను తాకిన రుతుపవనాలు... ఆదివారం నాడు ఏపీలోకి వచ్చాయి. కర్ణాటక (Karnataka) మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించాయి.

ఈ క్రమంలోనే ఏపీ వ్యాప్తంగా రుతుపవనాలు విస్తరించేందుకు రెడీగా ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఏపీలోని చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు వివరించారు. ఈ క్రమంలోనే ప్రకాశం జిల్లాను తొలకరి జల్లు పలకరించింది. ఉదయం 4 గంటల నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన సాధారణ వర్షం కురుస్తుంది. గత కొద్ది రోజులుగా తీవ్ర ఉక్కపోత..ఎండ తీవ్రతతో అల్లాడుతున్న ప్రజలు ఈ తొలకరి జల్లు ఉపశమనాన్ని ఇచ్చింది. ఆకాశం అంతా మేఘావృతమై వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.

Also read: బీచ్‌ లో ముగ్గురు యువతుల గల్లంతు..ఇద్దరి మృతి!

Advertisment
Advertisment
తాజా కథనాలు