/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-30T160945.517.jpg)
Rajinikanth Travels to Himalayas: రజనీకాంత్ మరోసారి హిమాలయాల బాట పట్టారు. రజనీ నటిస్తున్న చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసిన తరువాత హిమాలయాలకు వెళ్లడం రజనీకాంత్‌కు ఆనవాయితీగా మారింది. హిమాలయాల్లో కనీసం 10 రోజులకు తగ్గకుండా ఆయన గడిపి తిరిగొస్తారు. తరువాత కొత్త చిత్రానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఈ క్రమంలోనే తాజాగా చెన్నై నుంచి ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా డెహ్రాడూన్ ఎయిర్‌పోర్ట్‌లో తన ఆధ్యాత్మిక యాత్ర గురించి రజనీ కాంత్ మాట్లాడారు. ‘ఆధ్యాత్మిక యాత్ర చాలా ముఖ్యం. ఏటా నేను హిమాలయాలకు వెళ్తుంటా. వెళ్లిన ప్రతిసారీ కొత్త అనుభూతి కలుగుతుంది. ఈ సారి కూడా కొత్త అనుభవాలు పొందుతానని నేను నమ్ముతున్నాను’ అని రజనీకాంత్ అన్నారు.
Also Read: సుధీర్ బాబు మాస్ సంభవం.. అదిరిపోయిన ‘హరోం హర’ ట్రైలర్, ఈసారి హిట్టు గ్యారెంటీ!
చెన్నై నుంచి ఆయన డెహ్రాడూన్ కు విమానంలో బయలుదేరారు. అక్కడి నుంచి కారులో పర్యటిస్తూ కేదార్ నాథ్, బద్రీనాథ్ వంటి పుణ్య క్షేత్రాలను రజనీకాంత్ సందర్శించనున్నారు. ఆపై తాను ప్రత్యక్ష దైవంగా భావించే బాబా గుహకు వెళ్లి ధ్యానం చేసి, తిరిగి చెన్నై చేరుకుంటారని తెలుస్తోంది. ఆ తరువాతే ‘దర్బార్’ డబ్బింగ్, ప్రమోషనల్ కార్యక్రమాల్లో రజనీ పాల్గొంటారని సమాచారం.
రజనీకాంత్ ప్రస్తుతం కూలీ (Coolie), వెట్టయాన్ (Vettaiyan) చిత్రాల్లో నటిస్తున్నారు. తలైవా 170గా వస్తోన్న వెట్టయాన్ చిత్రానికి జై భీమ్ ఫేం టీజే జ్ఞానవేళ్ (TJ Gnanavel) దర్శకత్వం వహిస్తున్నాడు. దుషారా విజయన్, రితికా సింగ్ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) బ్యానర్‌పై సుబాస్కరన్ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, మాలీవుడ్ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil), మంజు వారియర్, రానా దగ్గుబాటి, రావు రమేశ్, రోహిణి మొల్లేటి, దుషారా విజయన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. Vettaiyan ఈ ఏడాది అక్టోబర్‌లో థియేటర్లలో సందడి చేయనుండగా.. విడుదల తేదీపై క్లారిటీ రావాల్సి ఉంది.