SA vs IND: అందినట్టే అంది చేజారిన మ్యాచ్.. రెండో టి20లో సౌతాఫ్రికాదే విజయం

అందివచ్చిన విజయం చివర్లో చేజారింది. సౌతాఫ్రికాతో టి-20 సిరీస్ రెండో మ్యాచ్ లో విజయంతో ప్రోటిస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా జట్టును విజయం వరించింది.

SA vs IND: అందినట్టే అంది చేజారిన మ్యాచ్.. రెండో టి20లో సౌతాఫ్రికాదే విజయం
New Update

SA vs IND: అందివచ్చిన విజయం చివర్లో చేజారింది. సౌతాఫ్రికాతో టి-20 సిరీస్ రెండో మ్యాచ్ లో విజయంతో ప్రోటిస్ జట్టు 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. డక్ వర్త్ లూయిస్ ప్రకారం 15 ఓవర్లలో 152 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా మొదటి నుంచి దూకుడుగా ఆడింది.

ఓపెనర్లు కుదురుకుని బౌండరీలు బాదుతూ వేగంగా పరుగులు రాబడుతున్న క్రమంలో జట్టు స్కోరు 42 పరుగుల వద్ద ఓపెనర్ మాథ్యూ బ్రీట్జ్కే(16) రనౌటయ్యాడు. అయినా స్కోరుబోర్డు మందగించలేదు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మర్క్రం క్రీజులో ఉన్నంత సేపూ (30; 17 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్) ధాటిగా బ్యాటింగ్ చేశాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన క్లసీన్ వెంటనే సిరాజ్ బౌలింగ్ లో యశస్వి చేతికి చిక్కాడు.

చివరి 13 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉన్న సమయంలో ముఖేశ్ కుమార్ మిల్లర్ ను పెవిలియన్ కు చేర్చాడు. అయితే, జడేజా వేసిన తర్వాతి ఓవర్ లో స్టబ్స్ బౌండరీతో పాటు మరో ఎండ్ లో ఉన్న ఫెహ్లుక్వాయో సిక్సర్ బాదడంతో మ్యాచ్ సౌతాఫ్రికా చేతిలోకి వెళ్లింది. భారత బౌలర్లలో ముఖేశ్ కుమార్ రెండు; జడేజా, సిరాజ్ ఒక్కో వికెట్ పడగొట్టారు.

ఇది కూడా చదవండి: రింకూ రిథమ్.. సూర్య మెరుపులు.. తడబడినా నిలబడిన భారత్

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, జాన్సెన్, విలియమ్స్, శంషీ, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. రింకూ టీ 20ల్లో తొలి హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు మొదట్లోనే ప్రోటిస్ బౌలర్లు మాక్రో జాన్సెన్, గెరాల్డ్ కోయెట్జీ షాకిచ్చారు. తొలి రెండు ఓవర్లలోనే ఓపెనర్లు యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్ ఇద్దరూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు. దీంతో భారత్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లు కనిపించింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దేందుకు ప్రయత్నించారు.

తిలక్, సూర్య ఇద్దరూ నిలకడగా ఆడుతూ క్రీజులో ఉన్నంతసేపూ దూకుడు ప్రదర్శించారు. ఈ క్రమంలో 29 పరుగులు (20 బంతుల్లో 4ఫోర్లు, ఒక సిక్సర్) చేసిన తిలక్ వర్మ కోయెట్జీ బౌలింగ్ లో జాన్సెన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. వేగంగా పరుగులు రాబడుతున్న సూర్య హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఊపు మీదున్న సూర్యకుమార్ ను (56; 36 బంతుల్లో 5ఫోర్లు, 3సిక్సర్లు) శంషీ ఔట్ చేశాడు. అప్పటికి భారత జట్టు స్కోరు 14 ఓవర్లలో నాలుగు వికెట్లకు 125 పరుగులు. అప్పుడు మొదలైంది రింకూ మరో బ్లాస్టింగ్ ఇన్నింగ్స్. మంచి రిథమ్ తో బ్యాటింగ్ చేసిన రింకూ ఈ మ్యాచ్ లో టీ 20లో తొలి హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. రింకూ సింగ్ (68; 39 బంతుల్లో 9ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో భారత్ 180 పరుగుల భారీ స్కోరు సాధించింది.

#bcci #sports-news #ind-vs-sa
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe