Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా?

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎన్ని మంచి పనులు చేస్తున్న నటుడు సోనూసూద్‌ను చాలా మంది అభిమానిస్తారు. కోవిడ్ తర్వాత ఈ విలన్ కాస్తా హీరో అయిపోయాడు. కానీ ఇప్పుడు మాత్రం చాలా తిట్లు తింటున్నాడు.

New Update
Sonu Sood: సోనూసూద్‌పై మండిపడుతున్న నెటిజన్లు...కారణం ఏంటో తెలుసా?

Sonu Sood on Swiggy Delivery Man:సోనూసూద్...విలన్ క్యారెక్టర్లతో ఫేమస్ అయ్యాడు. రీల్ జీవితంలో విలన్ వేషాలు వేసుకునే ఇతను నిజజీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నాడు. తను సంపాదించింది అంతా పేదల కోసం, ఆర్ధిక సహాయం కావాల్సిన వాళ్ళకు ఇస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచాడు. కోవిడ్ టైమ్‌లో అయితే ఎక్కడ చూసినా సోనూసూద్ పేరే వినిపించింది. గవర్నమెంటు నుంచి కూడా ఎంతో అప్రిసియేషన్ పొదాడు. అలాంటి సోనూసూద్ ఇప్పుడు విమర్శలు పాలవుతున్నాడు. ఎందుకు భయ్యా ఇలాంటి మాటలు అంటూ తిట్లు తింటున్నాడు.

అసలేం జరిగిందంటే...

ఢిల్లీలోని గురుగ్రామ్‌లో స్విగ్గీ డెలవరీకి వచ్చిన అబ్బాయి దొంగతనం చేశాడు. డెలివరీ ఇచ్చి వెళుతూ బయట ఉన్న కాస్ట్లీ నైకీ షూస్‌ను దొంగతనం చేశాడు. ఇది సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. దీన్ని కస్టమర్ సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియో ఫుల్ వైరల్ అయిపోయింది. సోషల్ మీడియాలో తెగ తిరుగుతోంది. దీని మీద నెటిజన్లు చాలా కామెంటు కూడా చేస్తున్నారు. స్విగ్గీ బాయ్ అలా ఎలా చేస్తాడంటూ నెటిజన్లు అడుగుతున్నారు. స్విగ్గీ యాజమాన్యం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ కూడా చేస్తున్నారు.

ఇదే వీడియో సోనూసూద్ కూడా చేశారు. అయితే ఆతను అందరిలా కాకుండా డిఫరెంట్‌గా రియాక్ట్ అయ్యాడు. స్విగ్గీ బాయ్‌ను ఏమీ అనవొద్దు, అతనని శిక్షించవద్దు అంటూ కోరాడు. పాపం అతనికి ఎంతో అవసరం అయి ఉండే అలా దొంగతనం చేసుంటాడని సపోర్ట్ కూడా చేశాడు. ఆ దొంగతనం చేసిన అబ్బాయిని స్త్రమీ అనవద్దు...అసలు అలా దొంగతనం చేసే వాళ్ళని ఎవరీ ఏమీ అనవద్దని కోరాడు. ఇప్పుడు ఇదే కామెంట్ మీద నెటిజన్లు మండిపడుతున్నారు. సోనూ సూద్ అలా ఎలా చెబుతాడు. అంటే అతను దొంగతనాన్ని ప్రోత్సహిస్తున్నాడా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వాహ్ ఎంత ధైర్యం ఈమెకు..ముగ్గురిని కాపాడిన మహిళ

Advertisment
తాజా కథనాలు