BIG BREAKING: ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ?

పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నుంచి ఎంపీగా కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు ఆర్టీవికి ఏఐసీసీ నుంచి సమాచారం అందింది. ఖమ్మం పార్లమెంట్ స్థానం నుంచి సోనియా గాంధీ పోటీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌కు ఏఐసీసీ సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

New Update
BIG BREAKING: ఖమ్మం నుంచి సోనియా గాంధీ పోటీ?

Sonia Gandhi: తెలంగాణ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామం చోటు చేసుకోనుందా? అంటే దానికి అర్టీవి (RTV Exclusive) అవును అనే సమాధానం చెబుతుంది. AICC నుంచి RTVకి కీలక సమాచారం అందింది. మరి కొన్ని నెలల్లో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (Parliament Elections) తెలంగాణ నుంచి కాంగ్రెస్ (Congress) అగ్రనాయకురాలు సోనియా గాంధీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: 200 యూనిట్ల ఫ్రీ కరెంట్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

ఖమ్మం నుంచే...

ఎంపీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్‌ బరిలో సోనియాగాంధీ ఉండనున్నట్లు సమాచారం. ఖమ్మంలో బీజేపీకి డిపాజిట్లు లేవు.. అలాగే తెలంగాణ ఎన్నికల్లో ఓటమిని చవి చూసిన బీఆర్‌ఎస్‌ పార్టీ కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉంది. అలాగే కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు అని వామపక్షాలు అంటున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ ఖమ్మం నుంచి పోటీ చేస్తే ఈజీగా గెలవచ్చని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.

ఖమ్మం కాంగ్రెస్ కంచుకోట..

ఖమ్మం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు సీట్లలో కాంగ్రెస్‌, ఒక సీటులో మిత్రపక్షం సీపీఐ విజయం సాధించాయి. ఈ ఏడు సీట్లలో 30 వేలకుపైగా మెజార్టీ సాధించారు కాంగ్రెస్‌ అభ్యర్థులు. ప్రస్తుతం ఖమ్మం కాంగ్రెస్ కంచుకోటగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఉత్తరప్రదేశ్‌ నో..

గతంలో అమేధీ, రాయ్‌బరేలీ, బళ్లారి నుంచి కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ పోటీ చేశారు. దేశంలో కాంగ్రెస్‌కు ఖమ్మం సురక్షితమైన సీటు అని AICC వర్గాలు భావిస్తున్నాయి. యోగి దెబ్బకు ఉత్తరప్రదేశ్‌ మీద ఆశలు వదులుకుంటున్నారు కాంగ్రెస్‌ నేతలు. సోనియా పోటీ గురించి తెలంగాణ సీఎం రేవంత్‌కు AICC సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

ALSO READ: ట్రాఫిక్ చలాన్లపై రాయితీ పొడిగింపు

#cm-revanth-reddy #sonia-gandhi #parliament-elections #telangana-latest-news
Advertisment
Advertisment
తాజా కథనాలు