భార్య మాట వినట్లేదని మామను చంపిన అల్లుడు.. తర్వాత బామర్ది ఏం చేశాడంటే

రెండో బిడ్డ డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన భార్యను తిరిగి పంపించట్లేదనే కోపంలో ఓ యువకుడు మామను చంపాడు. ఇదే క్రమంలో తన తండ్రిని చంపాడనే కోపంతో బామర్ది సాయిలు బావ సంతును తలపై దాడిచేసి హతమార్చాడు. క్షణికావేశంలో ఇద్దరు ప్రాణం కోల్పోయిన సంఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది.

New Update
భార్య మాట వినట్లేదని మామను చంపిన అల్లుడు.. తర్వాత బామర్ది ఏం చేశాడంటే

భార్య కాపురానికి రావట్లేదని కోపంతో రగిలిపోయిన భర్త తనకు పిల్లను ఇచ్చిన మామను దారుణంగా చంపేశాడు. అయితే తన తండ్రినే చంపాడనే కోపంతో బావను హతమార్చాడు బామర్ది. క్షణికావేశంలో ఇద్దరు వ్యక్తులు నిండు ప్రాణాలు కోల్పోయిన భయంకరమైన సంఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకోగా స్థానికులు, బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది.

Also read :Telangana Elections 2023 : రక్తాలు కారేలా తన్నుకున్న బీఆర్ఎస్ నేతలు..కేటీఆర్ రోడ్ షోలో ఘటన..!!

బిచ్కుంద ఎస్సై మురళి, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండెనెమ్లి గ్రామానికి చెందిన అరుణకు ఇదే మండలం శాంతాపూర్‌ గ్రామస్తుడైన సంతుతో మ్యారేజ్ అయింది. వీరిద్దరికీ నాలుగేళ్ల కూతురు ఉంది. అయితే ఏడాది క్రితం అరుణ రెండోసారి గర్భం దాల్చింది. ఈ క్రమంలో భర్త సంతు వేధింపులు మొదలయ్యాయి. అవికాస్త తీవ్రకావడంతో అరుణ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడే రెండో కాన్పులోనూ మరో పాపకు జన్మించింది. అయితే భార్య, పిల్లలను అత్తింటివారు తన వద్దకు పంపించకపోవడంతో సంతు ఆగ్రహానికి లోనయ్యాడు. శుక్రవారం రాత్రి గుండెనెమ్లికి వెళ్లిన ఆయన.. భార్యను శాంతాపూర్‌ రావాలని కోరాడు. ఆమె నిరాకరించింది. ఆవేశానికి గురైన సంతు.. అరుణను కర్రతో కొట్టడంతో ఆమె తల పగిలింది. అక్కడే ఉన్న మామ రాంబోయి(55) అల్లుడిని అడ్డుకోబోయాడు. ఆగ్రహంతో ఊగిపోయిన సంతు కర్రతో మామను కొట్టాడు. దీంతో రాంబోయి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ దారుణమైన గొడవలోనే కోపోద్రిక్తుడైన రాంబోయి కుమారుడు సాయిలు, తన బంధువు వేణు కలిసి రాయితో సంతు తలపై కొట్టారు. ఈ ఘటనలో సంతు అక్కడే మరణించాడు. అరుణను చికిత్స కోసం బాన్సువాడ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలతోనే ఈ దారుణం చోటు చేసుకుందని, కోపం కంట్రోల్ చేసుకోలేక ఇద్దరు ప్రాణాలు కొల్పోయినట్లు బిచ్చుంద ఎస్సై మురళి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు