TDS : ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చే ఉద్యోగులు, వేతన జీవులకు ముఖ్య గమనిక. దేశవ్యాప్తంగా చాలా మంది వేతనజీవులకు తమ జీతంపై మూలం వద్ద పన్ను మినహాయింపు (ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ టీడీఎస్) సంబంధించి ఆదాయపు పన్ను శాఖ విభాగం నుంచి మెసేజ్‌లు వస్తున్నాయి.ఈ మెసేజులలో డిసెంబర్ 31 తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ యాజమాన్యాలు డిడక్ట్ చేసిన టీడీఎస్ వివరాలు సహా ఆర్థిక సంవత్సరం 2023-24కు సంబంధించిన మొత్తం టీడీఎస్ వివరాలు ఉన్నాయి. మీకు ఇలాంటి మెసేజ్ వచ్చిందా? వస్తే ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
ఓ ఉద్యోగికి వచ్చిన మెసేజ్ ను చూసినట్లయితే... 'డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో ఈ PAN *** నంబర్ పై యాజమాన్యం మినహాయించిన టీడీఎస్ అమౌంట్ రూ.*** గా పేర్కొన్నారు.. అలాగే ఆర్థిక సంవత్సరం 2023- 24 లో మొత్తం టీడీఎస్ రూ. **** గా ఉంది. పూర్తి సమాచారం కోసం 26 AS పరిశీలించండి. చివరి త్రైమాసికంలో, అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో జమ చేసిన టీడీఎస్ రసీదు అందించేందుకు ఐటీడీ టీమ్ లక్ష్యంగా పెట్టుకుంది.' అని మెసేజ్ ను పంపిస్తోంది ఆదాయపు పన్ను శాఖ.
ఈ మెసేజ్ అందుకున్న ఉద్యోగుల్లో చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నట్లు సమాచారం. ఈ మెసేజ్ రావడంతో మరింత ఎక్కువ ట్యాక్స్ కట్టాల్సి వస్తుందోనని ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆందోళన చెందాల్సిన అవసరం అస్సలు లేదు. అదొక సమాచారం మాత్రమే అని ఐటీ శాఖ చెబుతోంది. ఈ ఎస్ఎంఎస్ అలర్ట్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 లో అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి చెబుతోంది. ఉద్యోగులకు తమ మొత్తం టీడీఎస్ మినహాయింపులకు సంబంధించిన వివరాలపై సమచారం అందించేందుకు ఈ సేవలు ప్రారంభించినట్లు ఐటీ శాఖ వెల్లడించింది.
మెసేజ్‌లో వచ్చిన వివరాలు తమ శాలరీ స్లిప్ లో ని వివరాలు చెక్ చేసుకుని ఐటీఆర్ ఫైలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని ఐటీ నిపుణులు అంటున్నారు. ఉద్యోగులు జూన్ చివరి వరకు ఐటీఆర్ ఫైల్ చేసేందుకు వేచి చూడాల్సిన అవసరం ఉందన్నారు. జూన్ లోనే యాజమాన్యం ఫామ్ 16 విడుదల చేస్తుందని సూచించారు. అలాగే ఫామ్ 26 ఏఎస్, ఏఐఎస్ అప్డేట్ అవుతుంది కాబట్టి ఐటీఆర్ ఫైలింగ్ లో ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతున్నారు. ఆదాయపు పన్ను శాఖ పంపుతున్న మెసేజ్ లు చూసి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందులోని సమాచారాన్ని సరిచూసుకోవడం ద్వారా ఐటీఆర్ ఫైలింగ్ లో ఇబ్బందులు తప్పుతాయని ఐటీశాఖ నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: వాట్సాప్‌లో మరో ఇంట్రెస్టింగ్ ఫీచర్..అలా స్టేటస్ పెట్టగానే..ఇలా అలర్ట్..!