తెలంగాణ కొత్త పీసీసీ ప్రెసిడెంట్ ఎవరూ అనే అంశం తెరపైకి వచ్చింది. ఈ పదవి కోసం కీలక నేతలు రేసులో ఉన్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. అయితే పార్లమెంటు ఎన్నికల వరకే రేవంత్ పీసీసీ చీఫ్‌గా ఉంటారని.. లోక్‌సభ ఎన్నికల తర్వాత కొత్త అధక్షుడిని నియమిస్తామని గతంలోనే ఏఐసీసీ నేతలు ప్రకటించారు. త్వరలో సీఎం రేవంత్ పీసీసీ పదవి నుంచి దిగిపోయే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ పోస్ట్ కోసం చాలామంది నేతల ప్రయత్నాలు చేస్తున్నారు.
Also Read: రైతులకు రేవంత్ సర్కార్ శుభవార్త.. రుణమాఫీపై కీలక ఆదేశాలు!
బీసీ సామాజిక వర్గం నుంచి మధుయాష్కీగౌడ్, మహేష్ కుమార్ గౌడ్, అంజన్ కుమార్ యాదవ్ పీసీసీ పదవి కోసం ప్రయత్నిస్తున్నారు. రెడ్డి సామాజికవర్గం నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి ముందుకొస్తున్నారు. అయితే చివరికి కాంగ్రెస్ అధిష్ఠానం ఎవరివైపు మొగ్గుచూపుతుందనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.