Childrens Health Food: పిల్లలు బక్కగా ఉన్నారా? సెమోలినాతో ఇలా చేస్తే బొద్దుగా..పొడుగ్గా కావడం గ్యారెంటీ

పిల్లల కోసం ఆరోగ్యకరమైన వంటకం పెట్టాలంటే ఖచ్చితంగా సాలిడ్ ఫుడ్‌ రెసిపీని ప్రయత్నించాలి. పుట్టిన శిశువుకు తల్లి బిడ్డకు రుచికరమైన ఫుడ్‌లో తినిస్తుంది. ఈ సాలిడ్ ఫుడ్‌ పెట్టడం వలన పిల్లలకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు అంటున్నారు.

New Update
Childrens Health Food: పిల్లలు బక్కగా ఉన్నారా? సెమోలినాతో ఇలా చేస్తే బొద్దుగా..పొడుగ్గా కావడం గ్యారెంటీ

Childrens Health Food: పుట్టిన శిశువు 6 నెలల పాటు తల్లి పాలు తాగుతుంది. 6 నెలల పాటు తల్లి పాల నుంచి అభివృద్ధికి అవసరమైన పోషకాలు పొందుతారు. అయితే.. బిడ్డ పెరిగేకొద్దీ.. ఆకలి, పోషక అవసరాలు పెరుగుతూనే ఉంటాయి. తల్లి పాల ద్వారా దానిని నెరవేర్చడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. దీనికోసం ప్రతి తల్లి బిడ్డకు రుచికరమైన, ఆరోగ్యకరమైన వాటిని సాలిడ్ ఫుడ్‌లో తినిపించడానికి ప్రయత్నిస్తుంది. కాబట్టి సెమోలినా పుడ్డింగ్ రెసిపీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని పిల్లల వైద్య నిపుణులు అంటున్నారు. మీ పిల్లల కోసం ఆరోగ్యకరమైన వంటకం పెట్టాలంటే ఖచ్చితంగా ఒకసారి సాలిడ్ ఫుడ్‌ రెసిపీని ప్రయత్నించి చూడండి. యాపిల్, సెమోలినా హల్వా చేయడానికి.. సెమోలినా, నీరు, నెయ్యి, బాదం పొడి, ఆపిల్ ప్యూరీని సిద్ధం చేసుకోవాలి. ఇంట్లో ఆపిల్ పురీని సిద్ధం చేసుకోవచ్చు. పిల్లల కోసం యాపిల్, సెమోలినా పుడ్డింగ్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ఆపిల్, సెమోలినా తయారీ విధానం:

  • ఈ హల్వా చేయడానికి..ముందుగా పాన్‌ను గ్యాస్‌పై ఉంచి అందులో సెమోలినా వేసి కాసేపు వేచుంకోవాలి. ఇప్పుడు మరో పాన్‌లో నీటిని మరిగించాలి. తర్వాత మరుగుతున్న నీళ్లలో సెమోలినా వేసి అందులో ముద్దలు ఉండకుండా నిరంతరం కలుపుతూ ఉండాలి. ఇందులో నెయ్యి కూడా వేసుకోవచ్చు. నెయ్యి వేయటం వల్ల ఈ హల్వాలో పోషణ మరింత పెరుగుతుంది. ఇది పిల్లలకి సులభంగా జీర్ణమవుతుంది. దీని తర్వాత దానికి బాదం పొడిని కలుపుకోవచ్చు.కావాలంటే దానిలో యాపిల్ ప్యూరీ వేసి పిల్లలకి ఈ హల్వా తినిపించవచ్చు. దీన్ని కొద్దిగా పలుచన చేయడానికి.. తల్లిపాలు, ఫార్ములా పాలు కలపవచ్చు. ఇలా చేసిన హల్వా సిద్ధమైన తరువాత కొద్దిగా చల్లగైనాక పిల్లలకి తినిపించాలి.

పిల్లలకి ఏ వయస్సులో ఆహారం ఇవ్వాలి?

  • ఈ వంటకం ఏడు నెలల కంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలకు మాత్రమే పెట్టాలి. ఈ హల్వాను పసిపిల్లలకు, పెద్ద పిల్లలకు కూడా తినిపించవచ్చు. బిడ్డ  ఎక్కువగ ఆహారం తీసుకోవడం ప్రారంభించినప్పుడు..ఈ పోషకమైన సెమోలినా పుడ్డింగ్‌ని తయారు చేసి తినిపించవచ్చని నిపుణులు అంటున్నారు. సెమోలినాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తహీనతను నివారిస్తుంది. అంతేకాకుండా..ఇందులో భాస్వరం, మెగ్నీషియం  ఎముకల అభివృద్ధికి, నాడీ వ్యవస్థకు మేలు చేస్తుంది.సెమోలినాలో సెలీనియం కూడా ఉంటుంది. ఇది పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయటంతోపాటు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుందని వైద్యులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: గులాబీ రేకుల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలు.. చూసేయండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు