Deepthi Sunaina: సోషల్ మీడియా ఫాలో అయ్యేవారికి దీప్తి పేరును కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో నటించకపోయిన హీరోయిన్ తో సమానంగా క్రేజ్ దక్కించింది ఈ అమ్మడు. యూట్యూబ్ సీరీస్, షార్ట్ ఫిల్మ్స్, ఆల్బమ్స్ తో యూత్ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఫుల్ పాపులరైన ఈ బ్యూటీ.. అదే క్రేజ్ తో బిగ్ బాస్ సీజన్ 2లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఈ అమ్మడు ఇమేజ్ మరింత పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఎల్లప్పుడూ సూపర్ యాక్టీవ్ కనిపించే దీప్తి క్యూట్ ఫొటోలతో అబ్బాయిలను ఫిదా చేస్తుంటుంది.
మరో సారి ప్రేమలో పడ్డ దీప్తి సునైనా..?
అయితే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఓ పోస్ట్ నెట్టింట్లో వైరల్ గా మారింది. చీరకట్టులోని క్యూట్ ఫోటోలను షేర్ చేస్తూ వాటి కింద "నీలో ఉంది నా ప్రాణం అది నీకు తెలుసునా" అనే క్యాప్షన్ తో పెట్టింది. దీంతో దీప్తి మరో సారి ప్రేమలో పడిందా..? అతను ఎవరు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరి కొంతమంది అది కేవలం ఒక పాట లిరిక్ అని అంటున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
గతంలో యూట్యూబర్ షణ్ముఖ్ ను ప్రేమించిన దీప్తి.. రీసెంట్ గా 2021 లో వీరిద్దరికీ బ్రేకప్ అయినట్లు తన సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఆ తర్వాత దీప్తి తన పర్సనల్ లైఫ్ లో బిజీ అయిపొయింది. ఆల్బమ్స్, సీరీస్ చేస్తూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది.
Also Read: Ram Charan Birthday: రామ్ చరణ్ కోసం సురేఖ అదిరిపోయే గిఫ్ట్.. కొడుకు అంటే ఎంత ప్రేమో..!